ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Monkey fever: కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మంకీఫీవర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-07-29T13:08:17+05:30

స్థానిక గిండి కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మంకీ ఫీవర్‌(Monkey fever) పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక గిండి కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మంకీ ఫీవర్‌(Monkey fever) పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ప్రకటించారు. గురువారం ఉదయం ఆయన ఆ సంస్థలో ఏర్పాటైన మంకీఫీవర్‌ పరీక్షా కేంద్రాన్ని పీపీఈ కిట్‌ ధరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మంకీ ఫీవర్‌పై పరీక్షలు జరిపేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఐసీఎంఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం(State Govt) విజ్ఞప్తి చేసిందన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావటంతో కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మంకీఫీవర్‌ పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అత్యధికంగా కరోనా ముందస్తు పరీక్షలు జరిపింది కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని వైరాలజీ విభాగమేనని చెప్పారు. మంకీ ఫీవర్‌ కూడా ఓ రకమైన వైరస్‌ ద్వారానే వ్యాపిస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 18 వేలమందికి పైగా మంకీఫీవర్‌(Monkey fever)తో బాధపడుతున్నారని చెప్పారు. భారతదేశంలో కేరళవాసి సహా నలుగురికి మంకీ ఫీవర్‌ సోకిందన్నారు. ఈ మంకీఫీవర్‌ పరీక్షలు జరిపేందుకు కేంద్రప్రభుత్వం 14 సంస్థలకు అనుమతివ్వగా, అందులో గిండి కింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఒకటని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-07-29T13:08:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising