ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jackpot : అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తికి లాటరీలో రూ.1 కోటి బహుమతి

ABN, First Publish Date - 2022-07-27T01:55:36+05:30

అప్పుల ఊబిలో కూరుకుపోయి, సొంతింటిని అమ్ముకోవడానికి సిద్ధమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : అప్పుల ఊబిలో కూరుకుపోయి, సొంతింటిని అమ్ముకోవడానికి సిద్ధమైన ఓ వ్యక్తిని అదృష్ట దేవత అనుగ్రహించింది. ఇంటి అమ్మకం జరగడానికి రెండు గంటల ముందు లాటరీ రూపంలో ఆదుకుంది. ఆ అదృష్టవంతుడు కేరళలోని కొజిక్కోడ్‌, మంజేశ్వరంవాసి మహమ్మద్ (50). 


పెయింటింగ్ పనులు చేసే మహమ్మద్‌కు భార్య అన్నీ, నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. ఎనిమిది నెలల క్రితం దాదాపు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ఇంటిని నిర్మించారు. వీటన్నిటి కోసం ఆయన బ్యాంకులు, బంధువులకు సుమారు రూ.50 లక్షలు రుణం తీసుకున్నారు. మరోవైపు కతార్‌లో ఉంటున్న తన కుమారుడు నిజాముద్దీన్‌కు పంపించడం కోసం కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. 


ఎప్పటికైనా తనను అదృష్టం వరిస్తుందనే ఆశతో మహమ్మద్ హొసంగడిలో ఓ లాటరీ ఏజెన్సీలో లాటరీ టిక్కెట్లు కొంటూ ఉండేవారు. ఈలోగా రుణదాతల ఒత్తిడి మేరకు తనకు ఉన్న ఏకైక ఆస్తి అయిన సొంతింటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇంటిని కొనడానికి వచ్చిన వ్యక్తి నుంచి సోమవారం  బయానా (అడ్వాన్స్) తీసుకోవాలనుకున్నారు. ఆ సొమ్మును తీసుకోవడానికి రెండు గంటల ముందు తాను కొన్న కేరళ స్టేట్ లాటరీ టిక్కెట్‌కు రూ.1 కోటి బహుమతి వచ్చినట్లు తెలుసుకున్నారు. వెంటనే ఇంటిని అమ్మాలనే నిర్ణయాన్ని రద్దు చేసుకున్నారు. పన్నులు చెల్లించిన తర్వాత ఆయనకు రూ.63 లక్షలు వరకు వస్తుందని అంచనా. 


Updated Date - 2022-07-27T01:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising