ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నారీశక్తికి సెల్యూట్ : మోదీ

ABN, First Publish Date - 2022-03-08T18:02:25+05:30

తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు సెల్యూట్ చేస్తున్నామని, వివిధ పథకాల ద్వారా మహిళా సాధికారతపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తూనే ఉంటుందని అన్నారు. మహిళలకు గౌరవం, అవకాశాల కల్పనకు చేస్తున్న కృషి కొనసాగుతుందని మంగళవారంనాడు వరుస ట్వీట్లలో ఆయన పేర్కొన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో మహిళలను ముందువరుసలోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.


''ఆర్థిక స్వావలంబన నుంచి సామాజిక భద్రత వరకు, నాణ్యమైన హెల్త్‌కేర్ నుంచి హౌసింగ్ వరకూ, విద్య నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేంత వరకూ మన నారీశక్తిని భారత అభివృద్ధి యాత్రలో అగ్రభాగాన నిలిపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత పట్టుదలతో ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్తాం'' అని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కచ్‌లోని ఉమన్ సెయింట్స్ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన సెమినార్‌ను ఉద్దేశించి సాయంత్రం 6 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ప్రధాని ప్రసంగించనున్నారు.  ఈ సెమినార్‌లో కేందర్ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ, కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి, భారతీ ప్రవిణ్ పవార్, సాధ్వి రితంబర, మహో మండలేశ్వర్ కనకేశ్వరి దేవి తదితరులు పాల్గోనున్నారు.

Updated Date - 2022-03-08T18:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising