ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లోని భారతీయులను తరలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ

ABN, First Publish Date - 2022-02-28T17:18:48+05:30

రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కమిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కమిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియమించారు.ఉక్రెయిన్ సంక్షోభంపై సోమవారం ఏర్పాటు చేసిన అత్యున్నత సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు,జనరల్ వీకే సింగ్‌లను భారత విద్యార్థుల తరలింపు కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


 ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు ఇండిగో కూడా ఆపరేషన్ గంగాలో చేరనుంది. ఈ సమీక్షా సమావేశంలో భారతీయ విద్యార్థుల భద్రత, తరలింపునకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాని మోదీ ఆదేశించారు.ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఆ దేశంలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. 

Updated Date - 2022-02-28T17:18:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising