లాలు ఆరోగ్యంపై మోదీ ఆరా!
ABN, First Publish Date - 2022-12-07T04:22:03+05:30
ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మంగళవారం బిహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ను
పట్నా, డిసెంబరు 6: ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందని మంగళవారం బిహార్ ఉపముఖ్యమంత్రి, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్‌ను ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఆర్జేడీ ట్విటర్‌లో వెల్లడించింది. సింగపూర్‌లో సోమవారం లాలూకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. కాగా, లాలూప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ దానం చేసిన ఆయన చిన్న కూతురు రోహిణి ఆచార్యను కేంద్ర మంత్రి గిరిరాజ్ ప్రశంసించారు. ‘‘ప్రతి ఒక్కరికీ రోహిణి లాంటి కుమార్తె ఉండాలి’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Updated Date - 2022-12-07T04:22:04+05:30 IST