ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Model Swati: పారిశ్రామికవేత్త ఇచ్చిన నగలు మరో ప్రియుడికి బహుమతి !

ABN, First Publish Date - 2022-08-19T15:41:02+05:30

పూందమల్లి పారిశ్రామికవేత్త శేఖర్‌ తనకు కానుకగా ఇచ్చిన 550 సవర్ల బంగారు నగలను మరో ప్రియుడికి కానుకగా అందజేసినట్టు మోడల్‌ స్వాతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పూందమల్లి పారిశ్రామికవేత్త శేఖర్‌ తనకు కానుకగా ఇచ్చిన 550 సవర్ల బంగారు నగలను మరో ప్రియుడికి కానుకగా అందజేసినట్టు మోడల్‌ స్వాతి(Model Swati) పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపింది. పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శేఖర్‌, స్వాతిని పూందమల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పారిశ్రామికవేత్త శేఖర్‌ ప్రియురాలి మోజులోపడి తన ఇంటిలోని భార్య, కుటుంబ సభ్యుల బంగారు నగలను దొంగతనం చేసి స్వాతికి కానుకగా ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆమెకు లగ్జరీ కారు, రూ.30లక్షల నగదు ఇచ్చాడు. ప్రస్తుతం పూందమల్లి పోలీసులు ఇరువురిని కస్టడీలోకి తీసుకుని రెండు రోజులపాటు విచారణ జరిపారు. ఆ విచారణలో స్వాతి(Swati) ఏమాత్రం బెదరకుండా శేఖర్‌ ఇచ్చిన నగలను వలసరవాక్కంకు చెందిన తన ప్రియుడు జెరీన్‌కి కానుకలుగా చెల్లించానని తెలిపింది. ఆ మేరకు పోలీసులు జెరీన్‌ను అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి వెళ్లగా విషయం ముందుగానే పసిగట్టి జెరీన్‌ పారిపోయాడు. పోలీసులు జెరీన్‌ ఇంటిలో తనిఖీ చేసి రూ.10లక్షల విలువైన మోటారు సైకిల్‌, 100 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాతి ఇచ్చిన 500 సవర్ల నగలను జెరీన్‌ ఎక్కడ దాచాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Updated Date - 2022-08-19T15:41:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising