ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP: ట్రక్కు నుంచి రూ.12 కోట్ల మొబైల్ ఫోన్ల చోరీ, 24 గంటల్లో పట్టివేత

ABN, First Publish Date - 2022-08-27T22:20:42+05:30

హర్యానా వెళ్తున్న కంటైనర్ ట్రక్కు నుంచి రూ.12 కోట్లు (Rs.12 crores) విలువచేసే మొబైల్ ఫోన్ హ్యాండ్‌సెట్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్: హర్యానా వెళ్తున్న కంటైనర్ ట్రక్కు నుంచి రూ.12 కోట్లు (Rs.12 crores) విలువచేసే మొబైల్ ఫోన్ హ్యాండ్‌సెట్లను (Mobile phone handsets) నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, దొంగతనం జరిగిన 24 గంటల్లోనే ఈ సామగ్రిని ఇండోర్ సమీపంలోని మరో ట్రక్కులో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు శనివారంనాడు తెలిపారు. అగంతకులు పరారీలో ఉన్నారు.


సాగర్ ఎస్‌పీ తరుణ్ నాయక్ కథనం ప్రకారం, మహారాజ్ పూర్‌ గ్రామం సమీపంలోని నేషనల్ హైవే నెంబర్ 44పై ఒక ట్రక్కును అగంతకులు గురువారం రాత్రి అడ్డుకున్నారు. రూ.12 కోట్లు విలువ చేసే మొబైల్ ఫోన్లతో తమిళనాడు నుంచి గురుగావ్‌కు ట్రక్కు వెళ్తుండగా, అగంతకులు డ్రైవర్‌ను కిడ్నాప్ చేసి, మొబైల్ ఫోన్లు దోచుకున్న అనంతరం అతన్ని నర్సింగపూర్ వద్ద వదిలిపెట్టారు. దొంగిలించిన ఫోన్లను మరో ట్రక్కులో చేర్చి అగంతకులు పరారవుతుండగా సిప్రా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ట్రక్కును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దొంగలు ట్రక్కు విడిచిపెట్టి పరారయ్యారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ నాయక్ తెలిపారు.

Updated Date - 2022-08-27T22:20:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising