ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రహోంశాఖ మంత్రి Amit Shahకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన లేఖ

ABN, First Publish Date - 2022-04-16T17:04:30+05:30

మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) లేఖ రాసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను తొలగింప జేయండి

ముంబై(మహారాష్ట్ర): మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఎన్ఎస్ హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసింది.మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఎంఎన్ఎస్ కోరింది.అంతకుముందు మసీదుల్లోని  లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మే 3వతేదీ లోపు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


మంగళవారం థానేలో జరిగిన బహిరంగ ర్యాలీలో రాజ్ థాకరే మాట్లాడుతూ, మే 3వతేదీలోపు శివసేన నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించకపోతే, తమ ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు మసీదుల ముందు హనుమాన్ చాలీసా వాయిస్తారని అన్నారు.లౌడ్ స్పీకర్లు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఏ ప్రార్థనలకు వ్యతిరేకం కాదని, అయితే ప్రజలు తమ నివాసాల్లో తమ విశ్వాసాన్ని అనుసరించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని రాజ్ థాకరే అన్నారు.


Updated Date - 2022-04-16T17:04:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising