ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారంక్రితం Uddhav Thackerayకి మద్దతుగా కన్నీరుపెట్టి .. బలపరీక్షలో షిండే వర్గానికి మద్దతిచ్చిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-07-04T20:19:42+05:30

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరైన సంతోష్ బంగర్.. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకి మద్దతుగా నిలిచారు. వారంక్రితమే తన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం(Maharastra Political Crisis)లో శివసేన(Shivasena) ఎమ్మెల్యేల్లో ఒకరైన సంతోష్ బంగర్(Santosh bangar).. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే(Uddhav Thackerey)కి మద్దతుగా నిలిచారు. వారంక్రితమే తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఓ సభలో మాట్లాడుతూ.. ఉద్ధవ్‌కి మద్దతుగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా సోమవారం(నేడు) జరిగిన బలపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ మద్దతు తెలిపారు. అంతకుముందు ఆదివారం రాత్రి ముంబైలోని ఓ హోటల్లో సీఎం ఏక్‌నాథ్ షిండేని సంతోష్ బంగర్ కలిశారు. అధికారికంగా రెబల్ వర్గంలోకి ఫిరాయించారు.


బలపరీక్షలో మద్ధతు నేపథ్యంలో ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ట్విటర్‌లో జూన్ 24న పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశమైంది. మొన్నే ఏడ్చుకుంటూ వీడియో పెట్టి.. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండేకి ఎలా మద్దతు పలికారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఎమ్మెల్యే సంతోష్ బంగర్ కన్నీరు పెట్టుకున్నారు. ఉద్ధవ్ థాక్రేని మోసం చేయవద్దని, గువాహటి నుంచి తిరిగొచ్చేయాలని విజ్ఞప్తి కూడా చేశాడు. దీంతో  శివసేన మద్దతుదారులు ఎమ్మెల్యే కన్నీళ్లను కూడా తుడవడం కూడా వీడియోల కనిపించింది. 


బలపరీక్షలో సీఎం ఏక్‌నాథ్ షిండే సునాయాస విజయం..

మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా ఓటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్లు శాసనసభాపతి రాహుల్ నర్వేకర్ అసెంబ్లీలో ప్రకటించారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి.మహారాష్ట్రలో కొత్త ప్రతిపక్ష నాయకుడిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ‘‘షిండే ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు. షిండే నమ్మకమైన శివసైనికుడు. అతను బాలాసాహెబ్ సిద్ధాంతానికి విధేయుడు’’ అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు.



Updated Date - 2022-07-04T20:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising