ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదికపై సమస్యలు తెలపడమే ద్రావిడ మోడల్‌

ABN, First Publish Date - 2022-06-07T15:58:42+05:30

ప్రధాని పాల్గొనే వేదికపైనే ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలు తెలిపారని, అదే ద్రావిడ మోడల్‌ పాలన అని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                     - Mla Udayanidhi


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 6: ప్రధాని పాల్గొనే వేదికపైనే ముఖ్యమంత్రి రాష్ట్ర సమస్యలు తెలిపారని, అదే ద్రావిడ మోడల్‌ పాలన అని డీఎంకే యువజన విభాగం కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయనిధి పేర్కొన్నారు. తేనాంపేటలోని అన్నా అరివాలయంలో డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ‘కలైంజర్‌-99’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా యువజన విభాగంలో 25 లక్షల మంది సభ్యులుగా చేరారని, వారిలో 4 మంది రెండవ సారి పేర్లు నమోదుచేసుకున్నారన్నారు. రాష్ట్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా యువజన విభాగం సభలు నిర్వహించాలని, వేలాది మందితో నిర్వహించకుండా వంద మంది పాల్గొనేలా ఎక్కువ సభలు నిర్వహించాలని కోరారు. ప్రధాని పాల్గొన్న వేదికపై రాష్ట్ర సమస్యలు ఏకరువు పెట్టిన ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ దేశంలోనే పేరు పొందారన్నారు. తనను అందరూ ‘చిన్నవర్‌’ అని పిలుస్తున్నానని, వయస్సులో నేను అందరి కంటే చిన్నావాడినేనని పేర్కొన్నారు. డీఎంకేకు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అంటున్నారని, అన్నాడీఎంకే, మిత్రపక్షాలను ఆ పార్టీ మభ్యపెడుతోందని, ఈ విషయమై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్క తమిళుడు డీఎంకే వైపు ఉండేలా ప్రచారం చేపట్టాలని ఉదయనిధి పిలుపునిచ్చారు.

Updated Date - 2022-06-07T15:58:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising