ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA: ఎమ్మెల్యేపై వేటు

ABN, First Publish Date - 2022-11-25T08:14:37+05:30

కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించడంతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri)పైనా దౌర్జన్యానికి కారణమైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పార్టీ నుంచి తాత్కాలిక బహిష్కరణ

- కమిటీ క్రమశిక్షణా చర్యలు

- ఉత్తర్వులు రద్దు చేసిన దినేష్‌ గుండూరావు

అడయార్‌(చెన్నై), నవంబరు 24: కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విధ్వంసం సృష్టించడంతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి(KS Alagiri)పైనా దౌర్జన్యానికి కారణమైన తిరునల్వేలి జిల్లా నాంగునేరి నియోజకవర్గ ఎమ్మెల్యే రూబీ మనోహరన్‌(MLA Ruby Manoharan)పై వేటు పడింది. ఆయన్ని పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ గురువారం ప్రకటించింది. అయితే క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన రూబీ మనోహరన్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దినేష్‌ గుండూరావు గురువారం రాత్రి వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ రాయపేటలోని టీఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్‌ అళగిరిని ఎమ్మెల్యే రూబీ మనోహరన్‌ మద్దతుదారులు చుట్టుముట్టి ఆందోళన చేశారు. ఇది పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఈ ఘర్షణకు కేఎస్‌ అళగిరి వర్గీయులే కారణమంటూ ఆయనపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ నేపథ్యంలో 63 జిల్లాల అధ్యక్షుల సంతకాలు చేసిన తీర్మానం మేరకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ రూబీ మనోహరన్‌కు నోటీసులిచ్చి, రెండు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ గడువు విధించింది. అయితే, రూబీ మనోహరన్‌ మాత్రం వివరణ ఇచ్చేందుకు మరో తేదీ కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో గురువారం సమావేశమైన క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ కేఆర్‌.రామస్వామి నేతృత్వంలోని కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ నోటీసుకు స్పందించని రూబీ మనోహరన్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కేఆర్‌ రామస్వామి మీడియాతో మాట్లాడుతూ డీసీసీలు సంతకాలు చేసిన తీర్మానం మేరకు రూబీ మనోహరన్‌, ఎస్సీ విభాగం రంజన్‌ కుమార్‌లకు నోటీసులిచ్చామన్నారు. అయితే, రూబీ మనోహరన్‌(Ruby Manoharan) హాజరుకాకుండా, మరో 15 రోజుల గడువు కోరుతూ తనకు లేఖ రాశారన్నారు. కానీ, ఆయన లేఖను క్రమశిక్షణా కమిటీ ఆమోదించలేదన్నారు. ఆయన నేరుగా హాజరై వివరణ ఇచ్చేంత వరకు అంటే ఆర్నెల్ల పాటు తాత్కాలికంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. కాగా దీనిని రూబీ మనోహరన్‌ ఖండించారు. అన్యాయంగా తనపై చర్యలు చేపట్టారని, దీనిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ప్రకటించారు.

Updated Date - 2022-11-25T08:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising