ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నోడి టార్గెట్‌ మిస్‌

ABN, First Publish Date - 2022-08-08T06:10:23+05:30

తొలిసారిగా చిన్న ఉపగ్రహ వాహక నౌక(ఎస్‌ఎస్‌ఎల్వీ) ప్రయోగంతో చరిత్ర సృష్టించాలని ఆశించిన ఇస్రోకు నిరాశే ఎదురైంది. చిన్న రాకెట్‌ ప్రయోగంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తక్కువ ఎత్తులోనే ఉపగ్రహాల విడిచివేత

ఇస్రో ఎస్‌ఎస్‌ఎల్వీ తొలి ప్రయోగం విఫలం


శ్రీహరికోట (సూళ్లూరుపేట), ఆగస్టు 7: తొలిసారిగా చిన్న ఉపగ్రహ వాహక నౌక(ఎస్‌ఎస్‌ఎల్వీ) ప్రయోగంతో చరిత్ర సృష్టించాలని ఆశించిన ఇస్రోకు నిరాశే ఎదురైంది. చిన్న రాకెట్‌ ప్రయోగంతో అంతరిక్ష వాణిజ్య రంగాన్ని ఆకర్షించాలన్న ప్రయత్నానికి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్రో కొత్తగా అభివృద్ధి చేసి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఎస్‌ఎ్‌సఎల్వీ-డీ1 రాకెట్‌ ప్రయోగం విఫలమైంది. భూ పరిశీలన ఉపగ్రహం (ఈవోఎస్‌-2), ఆజాదీశాట్‌ ఉపగ్రహాలను తీసుకుని రోదసీలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎ్‌సఎల్వీ గురి తప్పింది. నిర్ణీత కక్ష్యకు చేరుకోలేక ఉపగ్రహాలను వదిలేసి గగనతలంలో మాయమైంది.


తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం (షార్‌) ప్రథమ ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరిన ఈ బుల్లి రాకెట్‌ 8 నిమిషాలపాటు శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగానే పయనించినా.. ఆ తర్వాత మాట వినలేదు. ప్రయోగానంతరం 8.10 నిమిషాలకు తడబడుతూ పయనించిన రాకెట్‌ నిర్దేశించిన ఎత్తుకు చేరుకోలేక ఉపగ్రహాలను మధ్యలోనే వదిలేసింది. దీంతో రాకెట్‌తో పాటు ఉపగ్రహాలు కూడా రోదసిలో మాయమైపోయాయి. డేటా కోల్పోవడంతో వీటి నుంచి సంకేతాలు అందలేదు.  


మూడో దశ నుంచే తడబాటు 

ఇస్రో ఈ రాకెట్‌ను నాలుగు దశలతో రూపొందించింది. తొలి మూడు దశలు ఘన ఇంధనంతో, చివరి నాలుగో దశ (ఉపగ్రహాలతో వెలాసిటీ స్రిమ్మింగ్‌ మాడ్యూల్‌-వీటీఎం) ద్రవ ఇంధనంతో పనిచేసేలా తయారుచేశారు. తొలి, రెండవ దశలు శాస్త్రవేత్తల అంచనాలకు అనుగుణంగానే పనిచేసి రాకెట్‌ను ప్రయోగానంతరం 5.30 నిమిషాలకు 325 కిలోమీటర్ల ఎత్తుకు చేరవేసి విడిపోయాయి. వెంటనే 3వ దశ మోటారు మరో 2.30 నిమిషాలు మాత్రం సజావుగా పయనించి రాకెట్‌ను 350 కిలోమీటర్ల ఎత్తుకు చేర్చింది. అక్కడివరకు సజావుగానే సాగిన రాకెట్‌.. 8.10 నిమిషాల నుంచి గతితప్పి కిందకు దిగడం ప్రారంభించింది. అలా కిందకు దిగుతూ 10.33 నిమిషాలకు మూడవ దశ విడిపోయింది. చివరిదైన నాలుగో దశ వీటీఎం పనిచేయడం ప్రారంభించినా పైకి ఎగబాకలేక కిందికే పయనించింది. అలా 12.22 నిమిషాలకు తొలి ఈవోఎ్‌స-2ని, 13.12 నిమిషాలకు ఆజాదీశాట్‌ను వీటీఎం వదిలేసింది.


ఇస్రో 6 భూకేంద్రాల్లో ఒకటైన దక్షిణ ఆస్ట్రేలియాలోని యటారద్గా కేంద్రానికి సిగ్నల్స్‌ అందలేదు. దాంతో మిషన్‌ డైరెక్టర్‌, ఉపగ్రహ డైరెక్టర్లు ఆందోళనకు గురయ్యారు. సెన్సర్ల వైఫల్యం కారణంగా ఉపగ్రహాలు నిర్దేశించిన 356 కిలోమీటర్ల వృత్తాకార వలయంలో కాకుండా 356-76 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విడిచిపెట్టిందని ఇస్రో తెలిపింది. ఫలితంగా ఈ ఉపగ్రహాలు నిరుపయోగం అయ్యాయని ఇస్రో ట్విటర్‌లో వెల్లడించింది. ఎస్‌ఎ్‌సఎల్వీ ప్రయోగం వైఫల్యంపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ వెబ్‌సైట్‌లో వీడియో ద్వారా వివరించారు. 

Updated Date - 2022-08-08T06:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising