ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Economy : 2021-22లో పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం : కేంద్రం

ABN, First Publish Date - 2022-05-21T00:56:31+05:30

మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)ల ప్రవాహం భారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మన దేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI)ల ప్రవాహం భారీగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (Commerce and Industries)  శుక్రవారం వెల్లడించింది. 2003-04 ఆర్థిక సంవత్సరంలో 4.3 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐలు రాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 83.57 బిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలిపింది. 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War), కోవిడ్-19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఎఫ్‌డీఐలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చినవాటి కన్నా 1.60 బిలియన్ డాలర్లు ఎక్కువ అని వివరించింది. 


తయారీ రంగం (Manufacturing Sector)లో ఎఫ్‌డీఐలు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12.09 బిలియన్ డాలర్లు కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 21.34 బిలియన్ డాలర్లు అని తెలిపింది. అంటే 76 శాతం పెరుగుదల నమోదైందని వివరించింది. 


సింగపూర్ నుంచి అత్యధికంగా FDIలు వచ్చాయని, ఆ తర్వాతి స్థానంలో అమెరికా, మారిషస్ ఉన్నాయని తెలిపింది. మొత్తం FDIలలో 27 శాతం సింగపూర్ నుంచి, 18 శాతం అమెరికా నుంచి, 16 శాతం మారిషస్ నుంచి వచ్చినట్లు పేర్కొంది. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ (Computer Software and Hardware) రంగానికి దాదాపు 25 శాతం ఎఫ్‌డీఐలు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో సేవా రంగం (12 శాతం వాటా), ఆటోమొబైల్ రంగం (12 శాతం వాటా) ఉన్నాయి. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగంలో కర్ణాటక (Karnataka)కు 53 శాతం, ఢిల్లీ (Delhi)కి 17 శాతం, మహారాష్ట్ర (Maharashtra)కు 17 శాతం చొప్పున వాటాలు దక్కాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎఫ్‌డీఐ ఈక్విటీ ఇన్‌ఫ్లోలో అత్యధికంగా, అంటే 38 శాతం వాటా, కర్ణాటకకు దక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (26 శాతం), ఢిల్లీ (14 శాతం) ఉన్నాయి. 


Updated Date - 2022-05-21T00:56:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising