ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Udayanidhi: ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం

ABN, First Publish Date - 2022-12-16T07:58:10+05:30

డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మిస్తామని యువజన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంత్రి ఉదయనిధి

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 15: డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మిస్తామని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) ప్రకటించారు. గుంటూరులో ఈ నెల 17 నుంచి 22వ తేది వరకు జరుగనున్న క్రీడా పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొంటున్న 177 మంది క్రీడాకారులకు స్థానిక వండలూరులోని క్రీడా విశ్వవిద్యాలయంలో శిక్షణ జరుగుతోంది. శిక్షణ పొందుతున్న క్రీడాకారులను ప్రోత్సహించేలా గురువారం నెహ్రూ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ... తాను క్రీడా శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన అనంతరం పాల్గొన్న తొలి కార్యక్రమం ఇదేనంటూ క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు ఏ క్రీడల్లో పాల్గొన్నా విజేతలుగా నిలవాలనే ధీమా ఉండాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఓ క్రీడాకారిణి మాట్లాడుతూ.. తమ పాఠశాల ప్రాంగణంలో సరైన క్రీడా మైదానం లేదని వాపోయింది. అందుకు మంత్రి స్పందిస్తూ.. ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం నిర్మించనున్నట్లు వివరించారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. వ్యాయామ తరగతుల సమయంలో కూడా పాఠ్యాంశాలు బోధిస్తున్నారని తెలుపగా, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు చేపడతామని మంత్రి హామీనిచ్చారు.

Updated Date - 2022-12-16T07:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising