ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: నా మనవడు, మనవరాలికి కూడా జ్వరం...!

ABN, First Publish Date - 2022-09-20T12:58:35+05:30

‘తన మనవడు, మనవరాలు కూడా జ్వరం బారిన పడి మూడు రోజుల్లో కోలుకున్నారు’ అని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మూడు రోజుల్లో కోలుకున్నారు 

- మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 19: ‘తన మనవడు, మనవరాలు కూడా జ్వరం బారిన పడి మూడు రోజుల్లో కోలుకున్నారు’ అని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Minister M. Subramaniam) తెలిపారు. ఓమందూర్‌ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో సోమవారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాకాలంలో జ్వరాలు వ్యాపిస్తాయని, సాధారణ రోజుల్లో ఒక్క శాతం మంది జ్వరాల బారిన పడుతుండగా, ప్రస్తుతం ఒకటిన్నర శాతం మంది బాధితులున్నారని, అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవరసం లేదన్నారు. ఇప్పటివరకు 368 మంది ఇన్‌ఫ్లూయన్సా జ్వరంతో చికిత్స పొందుతున్నారని, వారిలో ఐదేళ్లలోపు 42 మంది, ఐదు నుంచి 14 ఏళ్లలోపు 65 మంది  ఈ జ్వరం బారిన పడ్డారని తెలిపారు. వారిలో 264 మంది ప్రైవేటు ఆసుపత్రులు, 89 మంది ఇళ్లలోనే, 15 మంది ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. స్వల్ప జ్వర లక్షణాలున్న పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించవద్దని, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ప్రతిరోజు గమనించి, జ్వర లక్షణాలుంటే సత్వరం తల్లిదండ్రులను తెలియజేయాలని కోరారు. నా మనవడు, మనవరాలు కూడా జ్వరం బారిన పడి మూడు రోజుల్లో కోలుకున్నారని, అందువల్ల ప్రజలు ఈ జ్వరాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.


తిరువారూర్‌లో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ...

తిరువారూర్‌ జిల్లాలో ఓ విద్యార్థి సహా ఇద్దరికి స్వైన్‌ఫ్లూ(Swine flu) లక్షణాలు నిర్ధారణ అయ్యాయని జిల్లా కలెక్టర్‌ గాయత్రి కృష్ణన్‌ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌ విలేఖరులతో మాట్లాడుతూ, బాధిత విద్యార్ధిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్సలందిస్తున్నామని, విద్యార్థి చదివే పాఠశాల విద్యార్థులందరికి వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - 2022-09-20T12:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising