ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నీట్‌’ మినహాయింపు తీర్మానంపై సమగ్ర నివేదిక

ABN, First Publish Date - 2022-07-21T13:37:17+05:30

నీట్‌’ మినహాయింపు తీర్మానంపై కేంద్రప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. రాయపురంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                               - మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై), జూలై 20: ‘నీట్‌’ మినహాయింపు తీర్మానంపై కేంద్రప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. రాయపురంలోని ప్రభుత్వ స్టాన్లీ వైద్యకళాశాల ఆస్పత్రిలో నిర్వహించిన జాతీయ ప్లాస్టిక్‌ సర్జరీ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, నీట్‌ మినహాయింపు తీర్మానం గవర్నర్‌ ద్వారా రాష్ట్రపతికి పంపించారని తెలిపారు. గవర్నర్‌ ద్వారా రాష్ట్ర న్యాయశాఖకు కేంద్రప్రభుత్వం పంపిన లేఖ ప్రకారం, నీట్‌ మెరిట్‌ ఆధారిత పరీక్ష, ఇది జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకమా? అని ప్రశ్నించిందని తెలిపారు. కేంద్రప్రభుత్వ రెండు శాఖల ద్వారా అడిగిన ప్రశ్నలకు సమగ్రమైన నివేదిక అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రప్రభుత్వాలకు  అధికారం ఉంది అని కేంద్రప్రభుత్వానికి తెలియజేయనున్నామని, నీట్‌ నుంచి మినహాయింపు పొందడమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-21T13:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising