ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మాన్యులైన మేయర్‌ గారూ’!

ABN, First Publish Date - 2022-03-06T15:01:31+05:30

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లను పాతపద్ధతిలో సంభోధించేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. కేకేనగర్‌లో శనివారం ప్రారంభమైన మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ఆయన పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మళ్ళీ పాత పద్ధతిలోనే సంబోధన

- మంత్రి సుబ్రమణ్యం


చెన్నై: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లను పాతపద్ధతిలో సంభోధించేలా చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. కేకేనగర్‌లో శనివారం ప్రారంభమైన మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మత్రి మాట్లాడుతూ గతంలో కార్పొరేషన్‌ మేయర్లను ‘వణక్కత్తుకురియ మేయర్‌’ (మాన్యులైన మేయర్‌) అని సంబోధించే పద్ధతి ఉండేదని, అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక దానిని ‘మాన్బుమిగు మేయర్‌’ (గౌరవనీయులైన మేయర్‌) అంటూ మార్చారని గుర్తు చేశారు. మేయర్‌ సహాయకులను ధపేథార్‌ అని, గవర్నర్‌ సహాయకులను జమేదార్‌ అని పిలవటం ఆన వాయితీ అని, ఇదే విధంగా దశాబ్దాలుగా మేయర్‌ను సంబోధించే పదాన్ని మార్చటం తగదని ఆయన పేర్కొన్నారు. మేయర్‌ను పాత పద్ధతిలోనే మాన్యులైన’ అంటూ సంబోధించేందుకు వీలుగా చట్టాన్ని సవరించే విషయమై త్వరలో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రమంతటా నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్‌ శిబి రాలకు అపూర్వస్పందన లభించిందని తెలిపారు. ఈ ప్రత్యేక శిబిరాల ద్వారా ఇప్పటి వరకూ 3.72 కోట్ల మంది టీకాలు వేశామని,గత జనవరి నుండి ఇప్పటివరకూ పదికోట్లకు పైగా టీకాలు వేశామని చెప్పారు. బూస్టర్‌ డోస్‌లకు అర్హు లైన 8.45 లక్షలమందిలో ఇప్పటివరకు ఆరు లక్షల మంది ఆ టీకాలు వేసుకున్నారని చెప్పారు. తక్కిన రెండు లక్షల మందికి నిర్ణీతసమయంలో టీకాలు వేస్తామన్నారు. మంత్రి సుబ్రమణ్యంతో పాటు చెన్నై మేయర్‌ ప్రియ, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ తదితరులు శిబిరాన్ని పరిశీలించారు.


Updated Date - 2022-03-06T15:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising