ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: ‘కాసా’ సామాజిక సేవలు ప్రశంసనీయం

ABN, First Publish Date - 2022-12-09T10:05:34+05:30

సమాజసేవలో చర్చ్‌ ఆక్సిలరీ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌ (కాసా) సేవలు ప్రశంసనీయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మస్తాన్‌(Minister Mastan) కొనియాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 8: సమాజసేవలో చర్చ్‌ ఆక్సిలరీ ఫర్‌ సోషల్‌ యాక్షన్‌ (కాసా) సేవలు ప్రశంసనీయమని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మస్తాన్‌(Minister Mastan) కొనియాడారు. కాసా జాతీయ స్వచ్ఛంధ సేవా సంస్థ 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం రాత్రి ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. టి.నగర్‌లోని సర్‌ పిట్టి త్యాగరాయర్‌ వేదికలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి మస్తాన్‌, కాసా జాతీయ డైరెక్టర్‌ శుశాంత్‌ అగర్వాల్‌, సంస్థ సౌన్‌ జోన్‌ చీఫ్‌ జోనల్‌ ఆఫీసర్‌ పాల్‌ లూధర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మస్తాన్‌ మాట్లాడుతూ, లక్షలాది మందికి జీవనోపాధి కల్పన, నిరుపేదల జీవన ప్రమాణాల పెంపు, కరోనా, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు చేయూతనందిస్తున్న కాసా సేవలు ప్రశంసనీయమన్నారు. వేడుకల్లో సంస్థ జాతీయ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ కరుణాకరన్‌, సౌత్‌ జోన్‌ కో-ఆర్డినేటర్‌ ప్రేమ్‌కుమార్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఫ్రెడీ రాయ్‌ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణా బంజారా నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది.

Updated Date - 2022-12-09T10:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising