ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాకంతా సమానులే

ABN, First Publish Date - 2022-06-07T12:43:17+05:30

రాష్ట్రంలో ఆస్తికులు, నాస్తికులను సమానంగా భావించే ద్రావిడ తరహా పాలనే జరుగుతోందని, ఆలయ వ్యవహారాల్లో అక్రమాలు, భక్తులకు సమస్యలు తలెత్తినప్పుడే తాము జో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆస్తికులను, నాస్తికులను వేర్వేరుగా చూడం  

- మంత్రి పీకే శేఖర్‌బాబు


చెన్నై, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆస్తికులు, నాస్తికులను సమానంగా భావించే ద్రావిడ తరహా పాలనే జరుగుతోందని, ఆలయ వ్యవహారాల్లో అక్రమాలు, భక్తులకు సమస్యలు తలెత్తినప్పుడే తాము జోక్యం చేసుకుంటున్నామని హిందూ దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఆయన చిదంబరం నటరాజస్వామివారి ఆలయాన్ని దర్శించారు. ఆ సందర్భంగా దీక్షితార్లతో సమావేశమయ్యారు. దీక్షితార్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో నటరాజస్వామివారి ఆలయంలో భక్తులకు కల్పించాల్సిన సదుపాయాల గురించి వారితో చర్చించారు. ఆ తర్వాత మంత్రి శేఖర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ... చిదంబరం ఆలయంలో కనకసభ వేదికపై నుంచి స్వామివారిని దర్శించుకున్నానని, దీక్షితార్లు తనను ఆలయంలోని అన్ని సన్నిధులకు తీసుకెళ్ళి దర్శనం చేయించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో దీక్షితార్లతో కలిసి కూర్చుని వారి సమస్యలు తెలుసుకున్నానని, ఆలయంలో భక్తులకు ఇబ్బంది కలిగినందువల్లే తమ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపించామని ఆయన స్పష్టం చేశారు. త్వరలో ధీక్షితారులు, ఆలయ భక్తులు మెచ్చుకునే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఏ ఆలయంలోనూ భక్తులకు ఇబ్బంది కలుగకూడదనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ భావిస్తున్నారని, ఆ మేరకే తాను అన్ని ఆలయాల్లో ఆకస్మిక తనిఖీలు కూడా చేస్తున్నట్టు తెలిపారు. థిల్లై గోవిందరాజ పెరుమాళ్‌ ఆలయంలో జీర్ణోద్ధరణ, కుంభాభిషేకం నిర్వహణ గురించి దీక్షితార్లతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన ప్రకటించారు.  

Updated Date - 2022-06-07T12:43:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising