ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్జిత సేవలకు ఆన్‌లైన్‌

ABN, First Publish Date - 2022-04-29T12:58:36+05:30

ఆలయాల్ల ఆర్జిత సేవలకు భక్తులు సులువుగా నగదు చెల్లించేందుకు వీలుగా స్వైపింగ్‌ యంత్రాలు సమకూరుస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రకటించారు. గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

             -  550 ఆలయాల్లో నగదు చెల్లింపులకు  స్వైపింగ్‌ యంత్రాలు


చెన్నై: ఆలయాల్ల ఆర్జిత సేవలకు భక్తులు సులువుగా నగదు చెల్లించేందుకు వీలుగా స్వైపింగ్‌ యంత్రాలు సమకూరుస్తున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు ప్రకటించారు. గురువారం నగరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రంలోని హిందూ దేవాదాయశాఖ పరిధిలోని 550 ఆలయాలకు ఆ శాఖ మంత్రి 1500 స్వైపింగ్‌ యంత్రాలను అందించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి 22, ట్రిప్లికేన్‌ శ్రీపార్థసారథి ఆలయానికి 4, తిరువొత్తియూరు త్యాగరాజస్వామి ఆలయానికి 8, వడపళని మురుగన్‌ ఆలయానికి 5, తిరువేర్కాడు కరుమారియమ్మన్‌ ఆలయానికి 6, మైలాపూరు కపాలీశ్వరాలయానికి 5 చొప్పున మొత్తం 50 స్వైపింగ్‌ యంత్రాలను ఆయా ఆలయాల నిర్వహణాధికారులకు మంత్రి శేఖర్‌బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ స్వైపింగ్‌ యంత్రాల్లో రెండు స్విమ్‌ కార్డులను ఉపయోగించవచ్చని తెలిపారు. త్వరలో క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల ద్వారా ఆర్జిత సేవలకు నగదు చెల్లింపులను కూడా ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. అయోధ్యమండపం వివాదంలో కోర్టు ఉత్తర్వులను శిరసావహిస్తామని, దీనిపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చించి న్యాయనిపుణుల సలహాలను స్వీకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ  సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కలిమేడు సప్పరం దుర్ఘటన తర్వాత ఆలయాల్లో రథోత్సవాల నిర్వహణపై ప్రభుత్వం నిఘా వేయనున్నదని, తగు భద్రతా ఏర్పాట్లు చేపడుతుందని ఆయన వివరించారు.


Updated Date - 2022-04-29T12:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising