ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: పేదలపై ‘విద్యుత్‌’ భారం పడదు

ABN, First Publish Date - 2022-09-17T12:53:23+05:30

పేదలపై ఎలాంటి భారం లేకుండానే విద్యుత్‌ చార్జీలను పెంచామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ(State Power Minister Senthil

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                              - మంత్రి సెంథిల్‌ బాలాజి 


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 16: పేదలపై ఎలాంటి భారం లేకుండానే విద్యుత్‌ చార్జీలను పెంచామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ(State Power Minister Senthil Balaji) వ్యాఖ్యానించారు. కోయంబత్తూరులో జరిగిన చిన్నారులకు అల్పాహార విందు పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ.. పెరిగిన విద్యుత్‌ చార్జీలను ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్‌ చార్జీలతో పోల్చుతూ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా పత్రికల్లో ప్రకటన ఇవ్వడం జరిగిందన్నారు. 2.37 కోట్ల విద్యుత్‌ కనెక్షన్లలో కోటి మంది వినియోగదారులపై ఎలాంటి భారం లేదన్నారు. 63.35 శాతం మంది వినియోగదారులపై 2 నెలలకు రూ.55 చొప్పున పెరిగిందన్నారు. పేదలపై భారం వేయకుండా ఈ చార్జీలను పెంచినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కేవలం 25 శాతం మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండగా, మిగిలిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. 2006-11 ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన విద్యుత్‌ పథకాలను ఇపుడు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే డిసెంబరు నాటికి 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2022-09-17T12:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising