ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖనిజ నిక్షేపాలను వెలికి తీస్తాం

ABN, First Publish Date - 2022-01-08T17:32:05+05:30

దేశంలో ఉక్కుతయారీకి అవసరమయిన ముడి ఖనిజం నిక్షేపాలకు వెలికి తీస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రిరామచంద్ర ప్రసాద్‌సింగ్‌ చెప్పారు. బళ్లారి జిల్లా తోరణగల్లు వద్ద ఉండే జేఎస్‌డబ్ల్యు (జిందాల్‌)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విదేశాల నుంచి దిగుమతులు తగ్గిస్తాం 

- కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్రప్రసాద్‌ సింగ్‌


బళ్లారి(కర్ణాటక): దేశంలో ఉక్కుతయారీకి అవసరమయిన ముడి ఖనిజం నిక్షేపాలకు వెలికి తీస్తామని కేంద్ర ఉక్కుశాఖ మంత్రిరామచంద్ర ప్రసాద్‌సింగ్‌ చెప్పారు. బళ్లారి జిల్లా తోరణగల్లు వద్ద ఉండే జేఎస్‌డబ్ల్యు (జిందాల్‌) కంపెనీలో శుక్రవారం అదనంగా మరో 5 మిలియన్‌ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగుమతులు తగ్గించి భారత దేశంలోనే ఉక్కుతయారీకి అవసరమయిన ఖనిజ నిక్షేపాలను ఉపయోగంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్వేషణ చేస్తోందన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముడిఖనిజాల దిగుమతిని తగ్గించి దేశంలోని ప్రకృతి వనరులను ఉపయోగించుకుని దేశం ఆర్థికంగా మరింత బలపడే ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. ఉక్కుతయారీలో దేశంలోని అతి పెద్ద కంపెనీల్లో ఒకటి అయిన జిందాల్‌లో తయారు చేస్తున్న ఉక్కు అనేక రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారన్నారు. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుం దన్నారు. దేశం రూ. 72వేల కోట్ల విలువైన బొగ్గును దిగుమతి చేసుకుంటోందని, దిగుమతులను తగ్గించుకుంటే దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధిని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. ఈ భారీ ఉక్కు ఫ్యాక్టరీల్లో కాలుష్యం తగ్గించేందుకు జిందాల్‌ అత్యంత ఆధునిక పరికరాలను వాడుతోందన్నారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ అధ్యక్షుడు సజ్జన్‌ జిందాల్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఫ్యాక్టరీలో డిజిటల్‌ పరిజ్ఞానాన్ని అవలంభించి రోబోలతో మరింత ఎక్కువ ఉత్పత్తికి ప్రయత్నిస్తామన్నారు. ప్రపంచంలో భారీ నాణ్యమైన ఉక్కు కర్మాగారంగా తయారవుతుందన్నారు. దేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. 

Updated Date - 2022-01-08T17:32:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising