ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: మనసాక్షితో విధులు నిర్వహించండి

ABN, First Publish Date - 2022-12-16T09:23:24+05:30

వైద్యులు మనస్సాక్షితో విధులు నిర్వర్తించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వైద్యులకు ఆరోగ్యమంత్రి సలహా

- మధురాంతకం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు

అడయార్‌(చెన్నై), డిసెంబరు 15: వైద్యులు మనస్సాక్షితో విధులు నిర్వర్తించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తాము ఆకస్మిక తనిఖీలు చేసి వైద్య సేవలు మెరుగుపరచడం కంటే ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులే మనసాక్షితో పనిచేస్తే రోగులెంతోమంది బాగుపడతారని హితవు పలికారు. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం చెన్నై నుంచి కారులో బయలుదేరిన మంత్రి సుబ్రమణ్యం మార్గమధ్యలో మధురాంతకం ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని నలుగురు వైద్యులను గుర్తించారు. ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే ఆయన డాక్టర్లు, నర్సులు, సిబ్బంది హాజరుపట్టీ పరిశీలించగా నలుగురు వైద్యులు విధులకు గైర్హాజరైనట్లు తేలింది. దీంతో వారి గురించి ఆరా తీశారు. ఆ తర్వాత రోగుల వార్డులోకి వెళ్లి వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఆ తర్వాత ఆస్పత్రి వైద్యాధికారి గదికి వెళ్ళి, విధుల్లో లేని ప్రసూతి వైద్యురాలు మిర్లిన్‌, ఎనస్తీషియన్‌ ప్రభావడివుక్కరసి, ఎముకల డాక్టర్‌ హర్ష బాలాజీ, ఈఎన్‌టీ వైద్యురాలు కృత్తిక గైర్హాజరీ గురించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు వచ్చాయి. దీంతో ఆ నలుగురికి మెమో జారీచేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా, ఆస్పత్రితో పాటు ఇక్కడ పనిచేసే వైద్యులపై సరైన పర్యవేక్షణ లేకుండా వ్యవహరించిన చెంగల్పట్టు జిల్లా వైద్య సహాయ అధికారి రమామణిని తక్షణం బదిలీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మధురాంతకం ఆస్పత్రిలో వందకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయని, అలాంటి ఆస్పత్రిలో వైద్యుల పనితీరు ఏమాత్రం బాగోలేదని విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-16T09:23:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising