ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయనే లేకుంటే పెట్రోలు రూ.200 దాటేది...

ABN, First Publish Date - 2022-04-07T17:09:14+05:30

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ లేదంటే పెట్రోలు లీటరుకు రూ. 200 దాటేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి పేర్కొన్నారు. బెళగావిలో బుధవారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - పరిశ్రమలశాఖ మంత్రి నిరాణి 


బెంగళూరు: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ లేదంటే పెట్రోలు లీటరుకు రూ. 200 దాటేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి పేర్కొన్నారు. బెళగావిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా బసవరాజ్‌ బొమ్మై ఉండడంతోనే నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ సాధ్యమైందన్నారు. ప్రధానిగా మోదీ కాకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోలు రూ.200 పైగా దాటేదన్నారు. 30 ఏళ్లుగా బీజేపీ కార్యకర్తగా కొనసాగానని, మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. హోదా ఉన్నా లేకున్నా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తానన్నారు. 2023 ఎన్నికల్లో మరోసారి బీజేపీదే విజయమన్నారు. 150 సీట్లు గెలిచే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తొలగించాలనేది ముఖ్యమంత్రి, పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు. ముస్లింలకు ఆర్థిక బహిష్కారం వేయాలనే అంశంపై రాష్ట్ర, కేంద్ర నాయకులకు సంబంధం లేదన్నారు. పార్టీ తీసుకునే నిర్ణయాలకే తాము కట్టుబడతామన్నారు. రాష్ట్రంలో శాంతిని కాపాడడం ముఖ్యమన్నారు. కాంగ్రెస్‌ ఆరోపణలు అర్థరహితమని, ప్రతీదీ రాజకీయమే వారి కోణమన్నారు.  

Updated Date - 2022-04-07T17:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising