ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Nehru: నదీజలాలు సముద్రంపాలు చేయకండి

ABN, First Publish Date - 2022-09-13T14:29:57+05:30

నదీ జలాలు సముద్రంపాలు కాకుండా చూడాలని, ఆ నీటిని సద్వినియోగం చేసకునేలా పథకాలు రూపొందించాలని ఐఏఎస్‌ అధికారులకు నగర, పురపాలక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సద్వినియోగానికి పథకాలు రూపొందించండి 

- ఐఏఎస్‏లకు మంత్రి నెహ్రూ ఆదేశం


ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 12: నదీ జలాలు సముద్రంపాలు కాకుండా చూడాలని, ఆ నీటిని సద్వినియోగం చేసకునేలా పథకాలు రూపొందించాలని ఐఏఎస్‌ అధికారులకు నగర, పురపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ(Minister KN Nehru) సూచించారు. స్థానిక రాజాఅన్నామలైపురంలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం జరిగిన మంచినీటి సరఫరా, మురుగునీటి తొలగింపునకు సంబంధించి జాతీయ సదస్సును మంత్రి కేఎన్‌ నెహ్రూ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. నగర పాలక శాఖ కార్యదర్శి శివదా్‌సమీనా సహా చెన్నై మెట్రోవాటర్‌ బోర్డు, జలవనరులు, ఆనకట్టల నిర్వహణ తదితర విభాగాల ఐఏఎస్‌ అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు,  నీటి పైపులు తయారుచేసే సంస్థల యజమానులు పాల్గొన్నారు. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ మంచినీటి సరఫరా   భవనాలు నిర్మించినంత సులువు కాదని, తమిళనాడు ప్రత్యేకతను సంతరించుకున్న రాష్ట్రమని, 55 శాతం నగరాలతో సాంకేతికత అందిపుచ్చుకొని వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో జలజీవన్‌ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు కేంద్రప్రభుత్వం నుంచి మరికొంత గడువు కోరామని మంత్రి తెలిపారు. తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు(Contractors) పనులు నిర్వహించే సమయంలో ఆ ప్రాంతాల ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల ఆ పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. అదే విధంగా నగర శివారు ప్రాంతంలో చెంబరంబాక్కం రిజర్వాయర్‌లో భవన నిర్మాణానికి రహదారుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉందని, అయితే కేంద్రప్రభుత్వం మూడేళ్లుగా ఈ ప్రాజెక్టులు పరిశీలించలేదన్నారు. అందువల్లే నగరానికి చెందాల్సిన సుమారు 200 మిలియన్‌ లీటర్ల నీరు అందలేదని, ఈ సమస్య కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ ఏడాది 300 టీఎంసీల నీరు కావేరి నది, పాలారు, వైగై, తామ్రభరణి, చెరువులు, వాగుల నుంచి ప్రజల అవసరాలకు పోగా మిగతా 200 ఎంఎల్‌సీల నీరు వృధాగా సముద్రం పాలైందని, ఈ నీరు ప్రజల వినియోగానికి అనుకూలంగా కొత్త పథకాన్ని ఐఏఎస్‌ అధికారులు రూపొందించాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-09-13T14:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising