ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: పెట్టుబడులు అంకెల గారడీ కాదు

ABN, First Publish Date - 2022-12-07T10:49:21+05:30

ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో కుదిరిన ఒప్పందాల మేరకు రానున్న ఐదేళ్లలో 75 శాతం పథకాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశంలో కుదిరిన ఒప్పందాల మేరకు రానున్న ఐదేళ్లలో 75 శాతం పథకాలను అమలులోకి తీసుకురానున్నామని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మురుగేశ్‌ నిరాణి(Minister Murugesh Nirani) ప్రకటించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌(Meet the Press)లో ఆయన ప్రసంగించారు. బెంగళూరులో ఇటీవల జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో కుదిరిన ఒప్పందాలు అంకెల గారడీ కాదని స్పష్టం చేశారు. నవంబరులో జరిగిన సమావేశంలో రూ.9,81,784 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎర్రతివాచీ వేయడం అంటే రైతులు, కూలి కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టడం కాదన్నారు. పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం అవసరమై న భూములను సిద్ధంగా ఉంచిందని, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. మరో 2 లక్షల కోట్ల పెట్టుబడుల ఆఫర్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఆసక్తి చూపలేదన్నారు. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించడం సాధ్యం కాని పక్షంలో పెట్టుబడులు ఎన్ని వచ్చినా ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమల కోసం ఎక్కడా రైతుల నుంచి బలవంతంగా భూములను స్వాధీనం చేసుకోలేదన్నారు. రైతులు స్వచ్ఛందంగా ఇస్తేనే భూములను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తోందన్నారు. పలు చోట్ల రైతులు స్వయంగా ప్రభుత్వమే భూములు కొనాలంటూ విజ్ఞప్తి చేశారన్నారు. ఇదే సందర్భంగా రానున్న పదేళ్లలో డీజిల్‌, పెట్రోల్‌(Diesel, Petrol) ఇంజన్లు పూర్తిగా నిషేధం పరిధిలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఎథనాల్‌ ఉపయోగించే విషయంలో జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. అనంతరం మంత్రి సారథ్యంలో జరిగిన 130వ రాష్ట్రస్థాయి సింగిల్‌ విండో కీలక సమావేశంలో 59 ప్రాజెక్టులకు పచ్చజెండా చూపారు. వీటి ద్వారా మరో రూ.20,627.88 కోట్లు పెట్టుబడుల రూపంలో తరలిరానున్నాయి. తద్వారా 80,764 మందికి ఉపాధి లభించనుంది. మంత్రి నిరాణిని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి మల్లప్ప ఇతర పదాధికారులు సాదరంగా ఆహ్వానించారు.

Updated Date - 2022-12-07T10:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising