ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారు ఆరోగ్యంగా ఉండాలనే ఆంక్షలు: మంత్రి

ABN, First Publish Date - 2022-01-07T18:07:07+05:30

కరోనా ఉధృతి వేళ ఆ నేతలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ అభిప్రాయమని, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవేగౌడలు తమ ఆస్తి లాంటివారని రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప అభిప్రాయపడ్డారు. గురువారం బెంగళూరులో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కరోనా ఉధృతి వేళ ఆ నేతలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ అభిప్రాయమని, ప్రతిపక్షనేత సిద్దరామయ్య, మాజీ ప్రధాని దేవేగౌడలు తమ ఆస్తి లాంటివారని రాష్ట్ర మంత్రి ఈశ్వరప్ప అభిప్రాయపడ్డారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారిద్దరూ బాగుండాలనేది మా భావన అన్నారు. అందుకే పాదయాత్ర వద్దని వారిస్తున్నామన్నారు. ఆపేది లేదు ముందుకే వెళతామంటే వారి ఇష్టమన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దామన్నారు. ఇరువురు అగ్రనేతలన్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఎంతో అనుభవం కలిగిన వారన్నారు. అటువంటి వారు ప్రస్తుత కొవిడ్‌ క్లిష్ట సమయంలో గుంపుల మధ్యన వెళ్ళరాదనేది తమ అభిప్రాయమన్నారు. ఇదే సందర్భంగా కొవిడ్‌ కర్ఫ్యూ గురించి మాట్లాడుతూ రాష్ట్రమంతటా ఒకే విధానం ఉందని ఎవరు చెప్పారన్నారు. శివమొగ్గలో ఎటువంటి నిబంధనలు లేవన్నారు. బెంగళూరులో ఉన్నంత కొవిడ్‌ ప్రభావం పలు జిల్లాలలో లేదని ఇది ప్రజల అభిప్రాయమన్నారు. ముఖ్యమంత్రితో ఇదే విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు

Updated Date - 2022-01-07T18:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising