ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congressకు ఇల్లు ఒక్కటే... తలుపులు మూడు

ABN, First Publish Date - 2022-01-29T15:42:57+05:30

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు విబేధాలు ఎన్నికలకు ఏడాది ముందే తారస్థాయికి చేరాయని రెవెన్యూ మంత్రి అశోక్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విధాన సౌధలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఇల్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

          - మరో ఏడాదిలో మరెన్ని ద్వారాలో... మంత్రి అశోక్‌ ఎద్దేవా 


బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో గ్రూపు విబేధాలు ఎన్నికలకు ఏడాది ముందే తారస్థాయికి చేరాయని రెవెన్యూ మంత్రి అశోక్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విధాన సౌధలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఇల్లు ఒక్కటేనని... తలుపులు మూడు అన్నారు. ఇటీవలే సిద్దరామయ్య, డీకే శివకుమార్‌లు 10-15మంది కాంగ్రెస్‌లోకి వస్తారని గొప్పలు పోయారని ఆ పార్టీ సీనియర్‌ నేత ఇబ్రహీంను నిలుపుకోలేకపోతున్నారన్నారు. ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్నారు. ఎన్నికలు వచ్చే నాటికి కాంగ్రెస్‌ ఖాళీ కానుందని జోస్యం చెప్పారు. సీఎం ఇబ్రహీం సీనియర్‌ నేత అని, ఆయనే సిద్దరామయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రస్తుతం అతనే పార్టీకి దూరమవుతున్నారన్నారు. సీఎం ఇబ్రహీం గతంలో శివకుమార్‌ లీడర్‌ కాదని, సిద్దరామయ్యే నాకు లీడర్‌ అని చెప్పుకున్నారన్నారు. ప్రస్తుతం సిద్దరామయ్య ద్రోహం చేశారని వ్యాఖ్యానించారని ఇందుకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ ఖాళీ అవుతోందన్నారు. ఇక బీజేపీ నుంచి ఎవరూ కాంగ్రెస్‌కు వెళ్లరని ఇంకా కాంగ్రెస్‌వారు ఎంతమంది ఎటువైపు వెడతారో... వారిని చూసుకుంటే చాలన్నారు. దేశమంతటా కాంగ్రెస్‌ ఉనికిని కోల్పోతోందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీదే అధి కారమనే విశ్వాసం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-01-29T15:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising