ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళులను పనుల్లోకి తీసుకోండి

ABN, First Publish Date - 2022-07-13T14:00:13+05:30

రాష్ట్రప్రభుత్వ ఒప్పంద పనులు పొందిన కాంట్రాక్టర్లు తమ పనుల్లో అధికశాతం తమిళులకు అవకాశం ఇవ్వాలని ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - కాంట్రాక్టర్లకు మంత్రి వేలు సూచన


పెరంబూర్‌(చెన్నై), జూలై 12: రాష్ట్రప్రభుత్వ ఒప్పంద పనులు పొందిన కాంట్రాక్టర్లు తమ పనుల్లో అధికశాతం తమిళులకు అవకాశం ఇవ్వాలని ప్రజాపనుల శాఖ మంత్రి ఏవీ వేలు సూచించారు. తిరుచ్చి మన్నార్‌పురంలో భవన నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో పాల్గొన్న మంత్రి వేలు మాట్లాడుతూ... కార్మిక సంక్షేమ శాఖలో ఒక ఏడాదిలో 5 లక్షల మంది సభ్యులుగా చేరారని, కార్మికుల సంక్షేమార్ధం ప్రభుత్వం పలు పథకాలు అమలుచేస్తోందన్నారు. కానీ, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్లు పొందిన కాంట్రాక్ట్‌ సంస్థలు అధిక శాతం ఉత్తరాది వారిని పనుల్లో పెట్టుకుంటున్నారని, దీంతో తమిళులకు ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. ఈ విధానం కొనసాగితే రాష్ట్రంలో జరుగుతున్న నిర్మాణపనులు ఉత్తరాదివాసుల చేతుల్లోకే వెళ్లే అవకాశముందని, ప్రస్తుతం చిన్నదిగా ఉన్న ఈ సమస్య భవిష్యత్తులో తమిళుల జీవనోపాధికి ప్రమాదంగా మారే అవకాశముందన్నారు. రాష్ట్రంలోని కార్మికులందరికీ ఉపాధి దొరికితే రాష్ట్ర ఆర్ధికాభివృద్ధి కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందని అందరూ గుర్తించాలని మంత్రి సూచించారు.

Updated Date - 2022-07-13T14:00:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising