ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంక అధ్యక్ష భవనంలో భారీ నిధులు... భద్రతా సిబ్బందికి అప్పగించిన నిరసనకారులు...

ABN, First Publish Date - 2022-07-10T20:21:48+05:30

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) అధికారిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో : శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స (Gotabaya Rajapaksa) అధికారిక నివాసంలోకి దూసుకెళ్లిన నిరసనకారులకు పెద్ద ఎత్తున నిధులు కనిపించినట్లు తెలుస్తోంది. గుట్టలుగా ఉన్న కరెన్సీ నోట్లను నిరసనకారులు గుర్తించి, వాటిని భద్రతాధికారులకు అప్పగించినట్లు ఆ దేశ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. 


దేశాధ్యక్షుని అధికారిక నివాసంలో దొరికిన కరెన్సీ నోట్లను నిరసనకారులు లెక్కబెడుతున్నట్లు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సొమ్మును వారు భద్రతాధికారులకు అప్పగించారని తెలుస్తోంది. దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలను ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. 


గొటబయ రాజపక్స అధికారిక నివాసంలోకి శనివారం వేలాది మంది నిరసనకారులు చొరబడిన సంగతి తెలిసిందే. సెంట్రల్ కొలంబోలో అత్యధిక భద్రతగల ప్రాంతంలో ఈ భవనం ఉంది. దేశం మునుపెన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నందుకు బాధ్యత వహిస్తూ గొటబయ దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-10T20:21:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising