ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో 1.94 లక్షల కొత్త కేసులు

ABN, First Publish Date - 2022-01-13T07:28:44+05:30

దేశంలో 1.94 లక్షల కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా 9.55 లక్షలకు పెరిగి 211 రోజుల గరిష్ఠానికి చేరింది. మొత్తం కేసుల్లో 4,868 మందికి ఒమైక్రాన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మహారాష్ట్రలో అత్యధికంగా 46,723 మందికి.. 
  • కొవిడ్‌పై నేడు సీఎంలతో ప్రధాని సమీక్ష 
  • దేశంలో కొత్త కేసులు.. ‘మహా’లో 46,723 
  • 211 రోజుల గరిష్ఠానికి యాక్టివ్‌ కేసులు
  • కొవిడ్‌పై నేడు సీఎంలతో మోదీ సమీక్ష
  • బెంగాల్‌లో 32.18 శాతం ‘పాజిటివిటీ’
  • 48 గంటలకు సరిపడా ఆక్సిజన్‌ నిల్వలు సిద్ధం చేసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
  •  


న్యూఢిల్లీ, జనవరి 12 : దేశంలో 1.94 లక్షల కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా 9.55 లక్షలకు పెరిగి 211 రోజుల గరిష్ఠానికి చేరింది. మొత్తం కేసుల్లో 4,868 మందికి ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకగా, 1,805 మంది కోలుకున్నారు. మరో 442 మంది కొవిడ్‌తో మృతిచెందారు. బుధవారం అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర (46,723) మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలోని ముంబై నగరంలో 16,420 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాటకలో 21,000 కొత్త కేసులు బయటపడగా, వాటిలో 15,617 బెంగళూరు నగరంలోనే నిర్ధారణ కావడం గమనార్హం. కొత్త కేసుల విషయంలో మహారాష్ట్ర తర్వాతి స్థానంలో ఢిల్లీ (27,561), పశ్చిమ బెంగాల్‌(22,155), కేరళ (12,742), రాజస్థాన్‌ (9,488) ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో వ్యాక్సినేషన్‌కు 153.80 కోట్ల టీకా డోసులను వినియోగించారు. తాజాగా కొవిడ్‌ నిర్ధారణ అయిన ప్రముఖుల్లో పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాంనివాస్‌ గోయెల్‌ ఉన్నారు. దుబాయ్‌కి వెళ్లే విమానం ఎక్కేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ విమానాశ్రయానికి వచ్చిన ఐదుగురికి పరీక్షలు చేయగా పాజిటివ్‌ వచ్చింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో 42 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయింది.


హోం ఐసొలేషన్‌లో ఉన్న కొవిడ్‌ రోగుల కోసం ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం బుధవారం నుంచి ఆన్‌లైన్‌ యోగా తరగతులను ప్రారంభించింది. బుధవారం ఒక్కరోజే దేశంలో 66 లక్షల డోసులను వినియోగించారు. గత 24 గంటల్లో ఒమైక్రాన్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా 115 మంది మృతి చెందారు. భారత్‌లో ఒక్క మరణమే సంభవించింది. కాగా, దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం సాయంత్రం 4.30  గం టలకు వర్చువల్‌ భేటీ ద్వా రా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షించనున్నారు. మరోవైపు, ప్రముఖ గా యని లతా మంగేష్కర్‌ (92) మరో 10-12 రోజులు ఐసీయూలోనే ఉంటారని వైద్యులు చెప్పారు. 

Updated Date - 2022-01-13T07:28:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising