ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Service Delivery Assessment : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కు ప్రథమ స్థానం

ABN, First Publish Date - 2022-07-15T22:40:28+05:30

కేంద్ర మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్లు అందజేస్తున్న సేవల మదింపులో హోం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్లు అందజేస్తున్న సేవల మదింపులో హోం మంత్రిత్వ శాఖ, డిజిటల్ పోలీస్ పోర్టళ్ళు వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. NASSCOM, KPMG సహకారంతో పరిపాలనా సంస్కరణలు, ప్రజా సమస్యల శాఖ (DARPG) నిర్వహించిన నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్‌ ఫలితాలను ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాల ఆన్‌లైన్ సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నిర్ణీత కాలావధిలో ఈ విధంగా మదింపు చేస్తున్నట్లు తెలిపింది.  


తాజా ఫలితాల ప్రకారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రథమ స్థానంలో నిలిచింది. డిజిటల్ పోలీస్ పోర్టల్ రెండో స్థానంలో నిలిచింది. ఈ కసరత్తులో భాగంగా ఈ సర్వీస్ పోర్టల్స్‌ను వాటి పేరెంట్ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్ పోర్టల్స్‌తోపాటు మదింపు చేశారు. ఈ మదింపు కోసం ముఖ్యంగా రెండు వర్గాలుగా ఈ పోర్టల్స్‌ను విభజించారు. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు/కేంద్ర మంత్రిత్వ శాఖ పోర్టల్, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు/కేంద్ర మంత్రిత్వ శాఖ సర్వీసెస్ పోర్టల్ అని విభజించారు. ఈ పోర్టల్స్‌ను పరిశీలించడానికి వీలుండటం, సమాచారం అందుబాటులో ఉండటం, సులువుగా ఉపయోగించుకోగలగడం, భద్రత, వ్యక్తిగత గోప్యతలను పరిశీలించి ర్యాంకులు ప్రకటించారు. 


Updated Date - 2022-07-15T22:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising