ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kaveri river: మేట్టూరులో పెరుగుతున్న నీటిమట్టం

ABN, First Publish Date - 2022-08-31T16:41:27+05:30

కావేరి నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Dam) నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), ఆగస్టు 30: కావేరి నది పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా సేలం జిల్లాలోని మేట్టూరు డ్యాం(Mettur Dam) నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. మంగళవారం ఉదయం డ్యాం నీటిమట్టాన్ని పరిశీలించిన ప్రజాపనుల శాఖ అధికారులు 93.47 టీఎంసీల నీరున్నట్లు నిర్ధారించారు. డ్యాంకు సెకనుకు 1.30 లక్షల ఘనపుటడుగులుగా నీరు చేరుతున్న నేపథ్యంలో, డ్యాం నుంచి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్‌ కేంద్రం మీదుగా సెకనుకు 23 వేల ఘనపుటడుగుల నీరు, 16 గేట్ల ద్వారా సెకనుకు 1,07,000 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా, తూర్పు, పశ్చిమల కాలువల సాగు కోసం సెకనుకు మరో 400 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కావేరి పరీవాహక ప్రాం తంలో 15.40 మి.మీ వర్షపాతం నమోదైందని, వాతావరణం మరో మూడు రోజుల వరకు ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.

Updated Date - 2022-08-31T16:41:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising