ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైలాడుదురై చేరిన Metturu జలాలు

ABN, First Publish Date - 2022-06-02T16:36:56+05:30

సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి విడుదల చేసిన సాగుజలాలు మైలాడుదురై జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. మే 23న మేట్టూరు డ్యాం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి విడుదల చేసిన సాగుజలాలు మైలాడుదురై జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించాయి. మే 23న మేట్టూరు డ్యాం నుంచి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సాగునీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సాగుజలాలు మే 27న కల్లనై డ్యాంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి చివరి ఆయకట్టు సమీపంలోని మైలాడుదురై జిల్లా తిరువాలంగాడు కావేరి వాగు, విక్రమన్‌ వాగుకు చేరువగా ఉన్న జలాశయంలో మంగళవారం రాత్రి జలాలు ప్రవేశించాయి. బుధవారం ఉదయం స్థానిక ఇరిగేషన్‌ అధికారులు, రైతులు కలిసి ఆ జలాశయం నుంచి సెకనుకు 800 ఘనపుటడుగుల చొప్పున జలాలను కావేరి కాల్వలోకి విడుదల చేశారు. మేట్టూరు డ్యాం విధివిధానాల ప్రకారం కావేరి జలాలు కడలిలో కలిసే పూంపుహార్‌ ప్రాంతానికి ముందుగా ఉన్న మేలైయూరు, కడయనై ప్రాంతానికి చేరుకోగానే ఉప కాల్వల ద్వారా పంట పొలాలకు విడుదల చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఈ జలాలను పంట పొలాలకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. కావేరి, దాని ఉప కాల్వల ద్వారా విడుదలయ్యే జలాల ద్వారా మైలాడుదురై జిల్లాలో 48 వేల ఎకరాల్లో సాగుచేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - 2022-06-02T16:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising