ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metro railway stationsలో ఉచిత వైద్యశిబిరాలు

ABN, First Publish Date - 2022-02-27T17:28:39+05:30

స్థానిక మెట్రోరైల్వేస్టేషన్లలో మార్చి నెలలో 14 రోజులపాటు ప్రయాణికులు, ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మెట్రో రైల్వే సంస్థ అధికారులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి సహకారంతో ఈ ఉచిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: స్థానిక మెట్రోరైల్వేస్టేషన్లలో మార్చి నెలలో 14 రోజులపాటు ప్రయాణికులు, ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు మెట్రో రైల్వే సంస్థ అధికారులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి సహకారంతో ఈ ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వైద్యశిబిరాలు నిర్ణీత రైల్వేస్టేషన్లలో ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు నిర్వహించనున్నారు. ఆ మేరకు మార్చి ఒకటిన వడపళని మెట్రోరైల్వేస్టేషన్‌ వద్ద, మూడున కోయంబేడు స్టేషన్‌ వద్ద, ఐదున ఆలందూరు స్టేషన్‌ వద్ద, ఏడున సెంట్రల్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ వద్ద ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఇదే విధంగా మార్చి తొమ్మిదిన విమ్కోనగర్‌ మెట్రోరైల్వేస్టేషన్‌లో, 11న కాలడిపేట స్టేషన్‌లో, 15న న్యూవాషర్‌మెన్‌పేట స్టేషన్‌లో, 17న తండయార్‌పేట స్టేషన్‌లో, 19న వాషర్‌మెన్‌పేట స్టేషన్‌లో, 21న మళ్ళీ సెంట్రల్‌ మెట్రోరైల్వేస్టేషన్‌లో ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. 22న హైకోర్టు మెట్రోరైల్వేస్టేషన్‌లో, 25న ఎల్‌ఐసీ మెట్రోరైల్వేస్టేషన్‌లో, 29న థౌజెండ్‌లైట్స్‌ స్టేషన్‌లో, 31న ఏజీపీఎంఎస్‌ మెట్రోరైల్వేస్టేషన్‌లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సదవకాశాన్ని మెట్రోరైలు ప్రయాణికులు, నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని మెట్రో రైల్వేస్‌ సంస్థ అధికారులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


వారంలో 2 మెట్రోరైల్వేస్టేషన్ల ప్రారంభం

స్థానిక వాషర్‌మెన్‌పేట, తిరువొత్తియూరు విమ్కోనగర్‌ మెట్రోరైలు మార్గంలోని రెండు స్టేషన్లను వచ్చేవారం ప్రారంభించనున్నట్లు మెట్రోరైల్వేస్‌ సంస్థ అధికారులు తెలిపారు. గతేడాది మారి 14న వాషర్‌మెన్‌పేట నుంచి తిరువొత్తియూరు విమ్కోనగర్‌ వరకు నిర్మించిన మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఆ మార్గంలోని విమ్కోనగర్‌, తిరువొత్తియూరు తేరడి వీధి రైల్వేస్టేషన్ల నిర్మాణం, వాటి పక్కనే రైల్వే యార్డుల నిర్మాణపు పనులు పూర్తికాలేదు. దీంతో ఆ రెండు రైల్వేస్టేషన్లను ప్రారంభించలేదు. ప్రస్తుతం నిర్మాణ పనులన్నీ ముగియడంతో ఆ రెండు మెట్రోరైల్వే స్టేషన్లను వారం లోపున ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. తిరువొట్రియూరు తేరడి మెట్రోరైల్వేస్టేషన్‌ 70 అడుగుల ఎత్తున నిర్మించటం విశేషం. ఆ ప్రాంతంలో వడివుడైయమ్మన్‌ ఆలయ రథ్సోతవం సాఫీగా సాగేందుకుగాను ఆ ప్రాంతం వద్ద మెట్రోరైలేస్టేషన్‌ ఎత్తును పెంచారు. 

Updated Date - 2022-02-27T17:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising