ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Notices: మెరీనాలో 300 దుకాణాలకు నోటీసులు

ABN, First Publish Date - 2022-08-02T15:39:37+05:30

స్థానిక మెరీనా తీరం(Marina Beach)లో ఉన్న దాదాపు 300 దుకాణాలకు చెన్నై నగర పాలక సంస్థ (చెన్నై కార్పొరేషన్‌) తాజాగా నోటీసులు జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), ఆగస్టు 1: స్థానిక మెరీనా తీరం(Marina Beach)లో ఉన్న దాదాపు 300 దుకాణాలకు చెన్నై నగర పాలక సంస్థ (చెన్నై కార్పొరేషన్‌) తాజాగా నోటీసులు జారీచేసింది. మద్రాస్‌ హైకోర్టు ఆదేశం మేరకు మెరీనా తీరంలో స్మార్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. మెరీనా తీరం వెంబడి స్మార్ట్‌ దుకాణాలు ఏర్పా టు చేయాలని గత ఏడాది హైకోర్టు(High Court) ఆదేశించింది. దీన్ని దుకాణాల యజమానులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా గత ఏడాది కాలంగా ఈ ప్రాజెక్టు అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో మెరీనా తీరాన్ని పరిరక్షించే చర్యల్లో భాగంగా తీరం వెంబడి స్మార్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు చెన్నై కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కార్పొరేషన్‌ అనుమతి లేకుండా వెలసిన 300 దుకాణాల యజమానులకు తాజాగా నోటీసులు జారీచేసింది. ఇదే విషయంపై కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు మాట్లాడుతూ ఒక వేళ కార్పొరేషన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా దుకాణాల యజమానులు ఆందోళనకు దిగితే దుకాణాలను వేరే వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు. దీనిపై వ్యాపారులు మాట్లాడుతూ నిజానికి మెరీనా తీరం(Marina Beach)లో అనుమతి పొందిన దుకాణాలు 1459 మాత్రమేనని తెలిపారు. ఇపుడు 900 మాత్రమే కేటాయించనున్నారని వీటిలో 60 శాతం దుకాణాలు గతంలో ఉన్న వ్యాపారులకే కేటాయించనున్నారని పేర్కొన్నారు. మిగిలినవి ఇతరులకు కేటాయించాలని భావిస్తున్నారని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తామని వారు ప్రకటించారు. 

Updated Date - 2022-08-02T15:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising