ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కాలేజీలో అండర్‌కవర్‌ ఆపరేషన్‌

ABN, First Publish Date - 2022-12-13T03:00:32+05:30

సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ స్వయంగా ‘పోకిరి’లా నటించి రౌడీగ్యాంగ్‌లో కలిసిపోయి.. వారిని తుదముట్టించడం సినిమాలో చూశాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్‌, డిసెంబరు 12: సంఘవిద్రోహ శక్తుల ఆట కట్టించేందుకు ఓ పోలీస్‌ ఆఫీసర్‌ స్వయంగా ‘పోకిరి’లా నటించి రౌడీగ్యాంగ్‌లో కలిసిపోయి.. వారిని తుదముట్టించడం సినిమాలో చూశాం. కాగా, కాలేజీలో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ఓ మహిళా కానిస్టేబుల్‌ కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో.. ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులను కనిపెట్టి వారి పని పట్టేలా చేశారు. కాకపోతే ఇక్కడ కానిస్టేబుల్‌ మంచి విద్యార్థినిగా నటించారు. కాలేజీ విద్యార్థినిగా డ్రెస్సు, భుజానికి బ్యాగ్‌ వేసుకొని మూడు నెలలపాటు రోజూ కాలేజీకి వెళ్లారు. క్యాంప్‌సలో ర్యాగింగ్‌కు పాల్పడుతున్నవారి సమాచారం సేకరించారు. ఆ విద్యార్థులను కాలేజీ నుంచి మూడు నెలలపాటు సస్పెండ్‌ అయ్యేలా చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మహాత్మాగాంధీ మెడికల్‌ కాలేజీలో ఈ ‘ఆపరేషన్‌’ చేపట్టారు. షాలినీ చౌహాన్‌(24) ఈ అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

ఉత్తరాఖండ్‌లో 44మంది విద్యార్థులకు భారీ జరిమానా

ఉత్తరాఖండ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సర విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడిన 44మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.25వేలు చొప్పున యాజమాన్యం భారీ జరిమానా విధించింది. ఒకరిని సస్పెండ్‌ చేసింది. కాలేజీ ప్రిన్సిపాల్‌ అరుణ్‌ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 9న ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-12-13T11:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising