ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసం దుకాణాలను మూసివేయండి...దక్షిణ ఢిల్లీ మేయర్ ఆదేశం

ABN, First Publish Date - 2022-04-05T14:01:25+05:30

నవరాత్రుల సందర్భంగా దక్షిణ ఢిల్లీ నగరంలో ఏప్రిల్ 4 నుంచి 11వతేదీ వరకు మాంసం దుకాణాలను మూసివేయాలని నగర మేయర్ ఆదేశాలు జారీ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: నవరాత్రుల సందర్భంగా దక్షిణ ఢిల్లీ నగరంలో ఏప్రిల్ 4 నుంచి  11వతేదీ వరకు మాంసం దుకాణాలను మూసివేయాలని నగర మేయర్ ఆదేశాలు జారీ చేశారు.నవరాత్రి సందర్భంగా దక్షిణ ఢిల్లీలో మాంసం దుకాణాలు మూసివేయించడం మొదటిసారి.నవరాత్రి సమయంలో దుర్గాదేవికి రోజువారీ ప్రార్థనలు చేసేటపుడు మాంసం దుకాణాల వల్ల దుర్వాసన వస్తుందని, దీనివల్ల భక్తుల మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతింటాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జ్ఞానేష్ భారతికి రాసిన లేఖలో మేయర్ ముఖేష్ సూర్యన్ పేర్కొన్నారు.నవరాత్రుల కాలంలో, దుర్గామాత భక్తులు తొమ్మిది రోజుల పాటు శాకాహారంతో పాటు మాంసాహారం, మద్యం. కొన్ని సుగంధ ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉంటారని మేయర్ చెప్పారు. 


నవరాత్రి సందర్భంగా ప్రజలు తమ ఆహారంలో వెల్లుల్లి, ఉల్లిపాయల వాడకాన్ని కూడా వదిలేస్తారని, దేవాలయాల సమీపంలో మాంసం దుకాణాల్లో మాంసం విక్రయించడం భక్తులకు అసౌకర్యంగా ఉందని సూర్యన్ లేఖలో తెలిపారు. 9 రోజుల పాటు మాంసం దుకాణాలతోపాటు మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని మేయర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కూడా లేఖ రాశారు.


Updated Date - 2022-04-05T14:01:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising