ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MB Patil: బీజేపీ ఒక్క ప్రాజెక్టునూ నిర్మించలేదు..

ABN, First Publish Date - 2022-09-07T17:59:52+05:30

దేశంలో ఇప్పటి వరకూ బీజేపీ ఒక్క నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. ఇప్పుడు ఉండే నీటి ప్రాజెక్టులు అన్నీ దాదాపు 2 వేల నీటి ప్రాజెక్టులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంగ్రెస్‌ కాలంలో 2వేల ప్రాజెక్టులు నిర్మించాం 

- 150 స్థానాల్లో గెలుపు మాదే 

- పార్టీ ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌


బళ్లారి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఇప్పటి వరకూ బీజేపీ ఒక్క నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు... ఇప్పుడు ఉండే నీటి ప్రాజెక్టులు అన్నీ దాదాపు 2 వేల నీటి ప్రాజెక్టులు కాంగ్రెస్‌ అధికార కాలంలో నిర్మించినవే అని కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సమితీ అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌ అన్నారు. మంగళవారం బళ్లారిలో రాష్ట్ర ప్రచార సమితి అధ్యక్షుడు ఎంబీ పాటిల్‌(MB Pati) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బళ్లారి రూరల్‌ ఎ మ్మెల్యే బి. నాగేంద్ర, మాజీ మంత్రి ముండ్లూరు దివాకర్‌బాబు, నారా భరత్‌ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే గనేష్‌, సండూరు ఎమ్మెల్యే తుకారం, సిరుగుప్ప మాజీ ఎమ్మెల్యే నా గరాజు, కాంగ్రెస్‌ నాయకుడు రావూరు సునీల్‌, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ లాడ్‌, మేయర్‌ రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంబీ పాటిల్‌ మాట్లాడుతూ బీజేపీ దేశం నాశనం చేస్తోందని, నిత్యావసరాల పెరుగుదలతో సామాన్యుడు విలవిలలాడుతున్నారన్నారు. రకరకాల పన్నుల పేర్లతో డబ్బులు గుంజడమే బీజేపీ ధ్యేయమన్నారు. ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని, నిరుద్యోగుల బతుకు దుర్భరంగా మారిందన్నారు. గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Former Chief Minister Yeddyurappa), రక్తంతో రాసిస్తానని హమీలు అన్నీ నెరవేర్చుతామన్నారనీ, కానీ ఒక్క హమీ కూడా నెరవేర్చలేదన్నారు. కర్ణాటకలో ఉండే  విధాన సభ స్థానాలలో 140 నుంచి 150 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత సిద్దరామయ్య(Siddaramaiah), ఇతర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలిసి కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బళ్లారి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్‌ రఫీక్‌, కేపీసీసీ స్పోక్‌ పర్సన్‌ వెంకటేశ్‌ హేగ్డే, బసవరాజు, కార్పొరేటర్లు ముల్లంగి నందీష్‌, జగన్‌, వివేక్‌, విక్రమం, రామాంజినేయులు, మాజీ మేయర్‌ గుర్రం వెంకటరమణ, మాన య్య, మహిళ కాంగ్రెస్‌ నాయకురాలు మంజుళ, పద్మ, శాంతమ్మ, కుమారమ్మ, శోభకాళింగ, కమలమ్మ, షమీం షక్లీ, యరుకుల స్వామి, ఎల్‌, మారెన్న, విరేంద్ర కుమార్‌, పరుశురాం, చిన్నమలియప్ప, బోయపాటి విష్ణు, కొలగల్లు అంజిని. కుభేరా, నూర్‌, బెణకల్లు బసరాజు, బి.ఎం పాటిల్‌. మండ్రిగి నాగరాజు, మల్లికార్జున కురుగోడు, కుడితిన్ని శ్రీనివాసులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-07T17:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising