ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mayor: జీసీసీ పనితీరు భేష్‌

ABN, First Publish Date - 2022-12-07T10:24:12+05:30

నగరవాసుల కోసం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్న సదుపాయాల పట్ల అమెరికాలోని సాన్‌ ఆంటోనియా మేయర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సాన్‌ ఆంటోనియా మేయర్‌ ప్రశంస

చెన్నై, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): నగరవాసుల కోసం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అమలు చేస్తున్న పథకాలు, కల్పిస్తున్న సదుపాయాల పట్ల అమెరికాలోని సాన్‌ ఆంటోనియా మేయర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ప్రశంసల వర్షం కురిపించింది. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రేటర్‌ చెన్నై పనితీరు, చేపడుతున్న పథకాలపై అధ్యయనం చేసేందుకు అమెరికాలోని శాన్‌ ఆంటోనియా మేయర్‌ రాన్‌ నిరన్బర్గ్‌(Ron Nirenberg), మరికొంతమంది ప్రతినిధులు మంగళవారం ఉదయం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిపాలనా భవనాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, కమిషనర్‌ గగన్‌దీ్‌పసింగ్‌ బేదీ తదితరులు ఆ బృందానికి ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత శాన్‌ ఆంటోనియా బృందంతో రెండు కార్పొరేషన్లు కలిసి చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించారు. రెండు కార్పొరేషన్ల పనితీరు పరస్పరం సమీక్షించుకునేందుకు ఆయా ప్రతినిధి బృందాలు రెండు నగరాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ చరిత్ర, ప్రజల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలు, ప్రత్యేకించి కరోనా సమయంలో చేపట్టిన చర్యలపై కమిషనర్‌ గగన్‌దీ్‌ప సింగ్‌ శాన్‌ ఆంటోనియా ప్రతినిథి బృందానికి వివరించారు. ఆ తర్వాత ఆ బృందం కార్పొరేషన్‌ మీటింగ్‌ హాలును కూడా పరిశీలించింది. ఈ సందర్భంగా మేయర్‌ ప్రియ శాన్‌ ఆంటోనియా మేయర్‌ రాన్‌ నిరన్బర్గ్‌కు జ్ఞాపిక బహూకరించారు. డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, బేదీ, సాన్‌ ఆంటోనియా మాజీ మేయర్‌ పిల్‌ హార్డ్‌బెర్గర్‌, అమెరికా డిప్యూటి రాయబార కార్యాలయం డిప్యూటీ కాన్సొలేట్‌ జనరల్‌ జూడిద్‌ రవిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T10:24:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising