ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NIA,Ed raids: ఉగ్రవాదులతో పీఎఫ్ఐకు లింక్...100 మంది అరెస్ట్

ABN, First Publish Date - 2022-09-22T13:47:56+05:30

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీ ఉగ్ర బాగోతం గురువారం వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ పార్టీ ఉగ్ర బాగోతం గురువారం వెలుగుచూసింది. దేశంలోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(Popular Front of India)(పీఎఫ్ఐ) ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని(terrorism, radicalisation) జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)(Massive NIA crackdown), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం జరిపిన తాజా దాడుల్లో(NIA raids) వెల్లడైంది. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్ఐఏ,ఈడీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల ఆకస్మిక దాడులు చేశారు. 


ఈ దాడుల్లో 10 రాష్ట్రాల్లో వివిధ నేరాలతో సంబంధాలున్న 100 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను ఎన్ఐఏ,ఈడీ(NIA,Ed raids) అధికారులు గురువారం అరెస్ట్(arrest) చేసింది. పీఎఫ్ఐ ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వడం, శిక్షణ శిబిరాలు నిర్వహణ, ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేర్చిందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. 200కు పైగా ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యాలయాలు, పలువురు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేసి సోదాలు జరపగా పలు విషయాలు వెలుగుచూశాయి.మళప్పురం జిల్లా మంజేరిలోని పీఎఫ్ఐ పార్టీ ఛైర్మన్ ఒమా సలాం ఇంటితో సహా పలువురు ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. 


ఈ సోదాల సందర్భంగా పీఎఫ్ఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు.ఎన్ఐఏ, ఈడీ అధికారులు కేరళలోని 50 ప్రాంతాల్లో తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు చేశారని ఆ పార్టీ కేరళ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సత్తార్ చెప్పారు. మధురై, తేనీ, దిండిగుల్, రామనాథపురం, కడలూరు, తిరునల్వేలీ, టెంకాసీ ప్రాంతాల్లోని పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తల ఆస్తులపై బుధవారం రాత్రి ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.


కడలూరు పీఎఫ్ఐ అధినేత ప్యాజ్ అహ్మద్, మధురై జిల్లా కార్యదర్శి యాసర్ అరాఫత్ లను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని(Telangana) నిజామాబాద్ జిల్లా, ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని కర్నూలు,గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పీఎఫ్ఐ నేతలకు ఎన్ఐఏ నోటీసులు జారీ చేసి, వారి అక్రమ కార్యకలాపాలపై దర్యాప్తు సాగిస్తోంది. 


Updated Date - 2022-09-22T13:47:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising