ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gurugram డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-04-26T13:04:22+05:30

గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని చెత్త డంపింగ్ యార్డులో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గురుగ్రామ్: గురుగ్రామ్‌లోని మనేసర్‌లోని చెత్త డంపింగ్ యార్డులో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మనేసర్‌లోని సెక్టార్-6 సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలను ఆర్పేందుకు 35 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి రప్పించారు. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భారీగా మంటలు చెలరేగడంతో పొగలు కమ్ముకున్నట్లు కనిపించింది.సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ ఢిల్లీలోని జామియా నగర్‌లోని మురికివాడలో జరిగిన అగ్నిప్రమాదంలో 35 కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ మేరకు అగ్నిమాపకశాఖ అధికారులు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని అధికారులు తెలిపారు. 


ఈ ఘటనలో ఐదు పశువులు మృతి చెందినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు.మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో బాట్లా హౌస్ ప్రాంతంలోని మురికివాడలో అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖకు కాల్ వచ్చిందని, వెంటనే 11 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని గార్గ్ చెప్పారు.‘‘సుమారు 40 గుడిసెలకు మంటలు అంటుకున్నాయని, సాయంత్రం 4.40 గంటల సమయంలో మంటలు ఆర్పివేశాం’’ అని అతుల్ గార్గ్ చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - 2022-04-26T13:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising