ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agreement: ఓకే! పెళ్లి తరువాత కూడా క్రికెట ఆడనిస్తా..

ABN, First Publish Date - 2022-09-11T17:11:33+05:30

మదురై జిల్లా ఉసిలంపట్టిలో శుక్రవారం ఓ వధువు ఆమె వరుడికి ఓ వింత అగ్రిమెంట్‌(Agreement) రాసిచ్చింది. పెళ్లి తరువాత కూడా వరుడిని క్రికెట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - పెళ్లిపీటలపై వరుడికి అగ్రిమెంట్‌ రాసిచ్చిన వధువు


చెన్నై, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మదురై జిల్లా ఉసిలంపట్టిలో శుక్రవారం ఓ వధువు ఆమె వరుడికి ఓ వింత అగ్రిమెంట్‌(Agreement) రాసిచ్చింది. పెళ్లి తరువాత కూడా వరుడిని క్రికెట్‌ ఆడనిస్తానని, ఎలాంటి అభ్యంతరం పెట్టబోనంటూ రూ.20 రూపాయల స్టాంప్‌ పత్రంపై ఒప్పందం రాసిచ్చింది. ఆ తరువాతే ఆమె మెడలో తమ స్నేహితుడిని తాళి కట్టనిచ్చారు ఆ వరుడి స్నేహితులు. వివరాల్లోకి వెళితే.. కీళ్‌పుదూర్‌కు చెందిన స్నేహితులంతా జట్టుగా క్రికెట్‌ ఆడుతున్నారు. అయితే పెళ్లి చేసుకున్న సభ్యులంతా మళ్లీ గ్రౌండ్‌ ముఖం చూడడం మానేస్తున్నారు. దీంతో తమ స్నేహితుడు హరిప్రసాద్‌, తేని చెందిన పూజను శుక్రవారం సాయంత్రం వివాహం(Marriage) చేసుకునేందుకు పీటలెక్కగా, ఆ సమయంలో స్టాంప్‌ పేపర్లను తీసుకొచ్చిన ఆ బృందం.. వధువు సంతకం పెట్టాకే మాంగల్యధారణ కానిచ్చింది. ముందు ఇరువురి కుటుంబీకులు ఈ వ్యవహారం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినా, అసలు విషయం తెలిసి వారూ ఈ ఒప్పందానికి మద్దతు పలకడం విశేషం. 

Updated Date - 2022-09-11T17:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising