ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marina: నేటినుంచి అందుబాటులోకి మెరీనా చెక్కవంతెన

ABN, First Publish Date - 2022-12-16T10:51:50+05:30

‘మాండస్‌’ తుఫాన్‌ భీభత్యానికి మెరీనా సముద్రతీరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన చెక్క వంతెన ధ్వంసమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), డిసెంబరు 15: ‘మాండస్‌’ తుఫాన్‌ భీభత్యానికి మెరీనా సముద్రతీరంలో దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన చెక్క వంతెన ధ్వంసమైంది. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (Greater Chennai Corporation) ధ్వంసమైన వంతెన తొలగించి ఆ ప్రాంతంలో నిర్మించిన కొత్త వంతెన శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మెరీనా తీరంలోని సెల్ఫీ పాయింట్‌ సమీపంలో 380 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో తుఫానును తట్టుకోగల సామర్ధ్యంతో ఈ వంతెన నిర్మించినట్లు అధికారులు తెలిపారు.

విద్యుత్‌ బోర్డుకు రూ.38 కోట్ల నష్టం

‘మాండస్‌’ తుఫాను కారణంగా తమిళనాడు విద్యుత్‌ బోర్డుకు రూ.38 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, విద్యుత్‌ వ్యవస్థను సరిచేసేందుకు ప్రభుత్వం నుంచి రూ.50 కోట్లు కోరినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 9వ తేది బంగాళాఖాతంలో మాండస్‌ తుఫాన్‌ తీరం దాటిన సమయంలో సబ్‌ స్టేషన్లు, 969 విద్యుత్‌ స్తంభాలు, 250 హై ఓల్టేజీ విద్యుత్‌ స్తంభాలు, 46 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. నష్టాన్ని సరిచేసేందుకు అవరసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-12-16T10:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising