ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్రిడ్జి, మొబైల్ టవర్లు పేల్చేసిన నక్సల్స్

ABN, First Publish Date - 2022-01-23T15:45:43+05:30

జార్ఖాండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయి విధ్వంసాలకు పాల్పడ్డారు. జార్ఖాండ్‌లోని గిరిడి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: జార్ఖాండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయి విధ్వంసాలకు పాల్పడ్డారు. జార్ఖాండ్‌లోని గిరిడి జిల్లా డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని శనివారం రాత్రి 2-2.30 గంటల ప్రాంతంలో పేల్చేశారు. ఇదే జిల్లాలో ఒక మొబైల్ ఫోన్ టవర్‌ను పేల్చేసి, మరో టవర్‌కు నిప్పుపెట్టారు. నక్సల్స్ తమ అగ్రనేత ప్రశాంత్ బోస్ అరెస్టుకు నిరసనగా 'రెసిస్టెన్స్ వీక్' పాటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజే వరుస విధ్వంసాలకు దిగారు. మావోయిస్టులు మొదట ఖుఖ్రా పోలీస్ స్టేషన్ ఏరియాలోని ఎయిర్‌టెల్ టవర్‌కు నిప్పుపెట్టాలని పోలీసులు తెలిపారు. మోటారు వాహనంపై వచ్చిన ఇద్దరు మావోయిస్టులు టవర్‌కు నిప్పుపెట్టినట్టు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్ (ఎస్‌డీపీఓ) డుమ్రి మనోజ్ కుమార్ తెలిపారు. తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో జైనుల యాత్రాస్థలమైన మధుబన్లో ఐడియా టవర్‌ను పేల్చేశారని ఆయన చెప్పారు. ఈ ఘటనల అనంతరం మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌ మరింత ముమ్మరం చేసినట్టు మనోజ్ కుమార్ తెలిపారు.


కాగా, ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా‌, ఆయన భార్య షీలా మరాండిని జార్ఖాండ్ పోలీసులు గత నవంబర్‌లో అరెస్టు చేశారు. సీపీఐ (మావోయిస్టు) సెక్రటరీగా ఉన్న బోస్...బీహార్, జార్ఖాండ్, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. బోస్ అరెస్టుకు నిరసనగా మావోయిస్టులు రెసిస్టెన్స్ వీక్ ప్రకటించారు. జనవరి 27న బీహార్, జార్ఖాండ్ బంద్‌కు సైతం పిలుపునిచ్చారు.

Updated Date - 2022-01-23T15:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising