ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళ సీఎంకు వ్యతిరేకంగా మావోయిస్టుల పోస్టర్లు

ABN, First Publish Date - 2022-04-03T21:09:53+05:30

కేరళ సీఎం పినరయి విజయన్‌ పాలనను వ్యతిరేకిస్తూ సీపీఐ మావోయిస్టుల పేరిట కేరళలో్ పోస్టర్లు వెలిశాయి. కోరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేరళ సీఎం పినరయి విజయన్‌ పాలనను వ్యతిరేకిస్తూ సీపీఐ మావోయిస్టుల పేరిట కేరళలో్ పోస్టర్లు వెలిశాయి. కోరికోడ్ జిల్లా మట్టికున్ను ప్రాంతంలో ఆదివారం ఈ పోస్టర్లు కనిపించాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ, సిల్వర్‌లైన్ సెమీ-హై స్పీడ్ రైల్వే కారిడార్ ప్రాజెక్టు చేపడుతూ కేరళ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని పోస్టర్లలో మావోయిస్టులు విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్నే, కేరళలోని అధికార ఎల్‌డీఎఫ్ అనుసరిస్తోందని మావోయిస్టులు పేర్కొన్నారు. 


కోరికోడ్ జిల్లాలో దాదాపు 17 పోస్టర్లను మావోయిస్టులు అతికించినట్లు పోలీసులు చెప్పారు. పోస్టర్లు వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రాంతంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సిల్వర్‌లైన్ రైల్వే ప్రాజెక్టు దాదాపు 530 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇది అందుబాటులోకి వస్తే భవిష్యత్ తరాలకు ఎంతో మేలు జరుగుతుందని, చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. మరోపక్క ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాయి.

Updated Date - 2022-04-03T21:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising