ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీవన్నీ ఉత్తుత్తి హామీలే: ఉద్ధవ్ థాకరే

ABN, First Publish Date - 2022-01-02T00:10:46+05:30

కొందరు నేతలు ఎన్నికలు వచ్చేసరికి అమలుకు సాధ్యం కాని హామీలిస్తూ సామాన్య..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొందరు నేతలు ఎన్నికలు వచ్చేసరికి అమలుకు సాధ్యం కాని హామీలిస్తూ సామాన్య ప్రజానీకాన్ని ఊహల్లో విహరింప చేస్తారని, అయితే ఆచరణకు వచ్చేసరికి చేతులెత్తేస్తుంటారని శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పరోక్షంగా బీజేపీపై శనివారంనాడు విమర్శలు గుప్పించారు. శివసేన మాత్రం అలాంటిది కాదని కుండబద్ధలు కొట్టారు. రాష్ట్ర అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


''చాలా మంది నేతలు సామాన్యుడి ముందుకు చంద్రుడు, నక్షత్రాలు తెస్తామంటూ ఎన్నికల ముందు హామీలు ఇస్తుంటారు. ఆ తర్వాత ఇచ్చిన హామీలు మరిచిపోతుంటారు. ప్రజానీక్షం నిలదిస్తే మాత్రం ఎన్నికల్లో అలాంటి హామీలు తప్పవని ఈ నేతలు చెబుతుంటారు. శివసేన మాత్రం అలాంటి పని ఎప్పుడూ చేయదు. అమలుకు సాధ్యం కాని హామీలను ఒక్కనాటికి ఇచ్చేది లేదు'' అని అన్నారు. కాంగ్రెస్, ఎన్‌సీపీతో కలిసే శివసేన ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. కోవిడ్ పరిస్థితిపై మాట్లాడుతూ, ఆందోళన పడాల్సిన పనిలేదని, మీ (అధికారులు) అందరి సహకారంతో పరిస్థితిని సమర్ధవంతగా ఎదుర్కోగలిగిన సామర్థ్యం ప్రభుత్వానికి ఉందని ఉద్ధవ్ థాకరే అన్నారు.

Updated Date - 2022-01-02T00:10:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising