ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనోహర్ పారికర్ కుమారుడు బీజేపీకి రాజీనామా, ఇండిపెండెంట్‌గా బరిలోకి

ABN, First Publish Date - 2022-01-22T00:32:35+05:30

గోవా దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనజి: గోవా దివంగత మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్టు శుక్రవారంనాడు ప్రకటించారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలిపారు. మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించిన పనజి నియోజకవర్గం టిక్కెట్‌ను ఉత్పల్ పారికర్ ఆశించారు. ఇందుకోసం గట్టి ప్రయత్నమే చేసినప్పటికీ బీజేపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకే పనజి టిక్కెట్ ఇచ్చేందుకు పార్టీ మొగ్గు చూపించింది. దీంతో మనస్తాపం చెందిన ఉత్పల్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.  పనజి నియోజకవర్గానికి 25 ఏళ్ల పాటు మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించారు.


రెండు సీట్లు ఆఫర్ చేశాం: దేవేంద్ర ఫడ్నవిస్

కాగా, తాజా పరిణామలపై బీజేపీ గోవా ఇన్‌చార్జి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ''పారికర్ కుటుంబం బీజేపీకి సొంత కుటుంబం వంటిది. పారికర్ కోరిన నియోజకవర్గానికి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనను అక్కడ్నించి తప్పించడం సమంజసం కాదు. అయినప్పటికీ, రెండు సీట్లలో ఏదో ఒకచోట నుంచి ప పోటీ చేయమని ఉత్పల్‌కు ఆఫర్ చేశాం. ఆ దిశగా చర్చలు కూడా జరిపాం'' అని ఆయన చెప్పారు.


ఆప్, శివసేన నుంచి ఉత్పల్‌కు పిలుపు

కాగా, ఉత్పల్‌ పారికర్‌కు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ సీటు ఆఫర్ చేశారు. శివసేన సైతం ఉత్పల్ పారికర్‌కు బాసటగా నిలిచింది. ఆయన పార్టీలోకి వస్తే పనజి అభ్యర్థిని ఉపసంహరించుకుని టిక్కెట్ కేటాయిస్తామని ప్రకటించింది.

Updated Date - 2022-01-22T00:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising