ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మణిపూర్‌లో రికార్డుస్థాయిలో పోలింగ్

ABN, First Publish Date - 2022-03-01T00:45:38+05:30

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మణిపూర్‌లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో రికార్డుస్థాయిలో పోలింగ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంఫాల్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు మణిపూర్‌లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో రికార్డుస్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల సమయానికి ఏకంగా 78.03 శాతం ఓటింగ్ నమోదైంది. 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన చెదురుమదురు హింసాత్మక ఘటనలు పోలింగ్‌కు కొంత ఆటంకం కలిగించాయి.


ఐదు జిల్లాల్లోని 1,721 పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. చురాచాంద్‌పూర్‌లోని రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో  ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఈవీఎం ఒకటి ధ్వంసమైంది. ఆ తర్వాత దాని స్థానంలో మరోదానిని ఏర్పాటు చేశారు.   


ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీపడుతుండగా, 12,09,439 మంది వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్, స్పీకర్ వై ఖేమ్‌చంద్ సింగ్, డిప్యూటీ ముఖ్యమంత్రి యుమ్నాన్ జోయ్‌కుమార్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఎన్ లోకేశ్ సింగ్ భవితవ్యం కూడా నేడే తేలిపోనుంది. 

Updated Date - 2022-03-01T00:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising