ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

West Bengal గవర్నర్‌గా మణిపూర్ గవర్నరు గణేశన్‌కు అదనపు బాధ్యతలు

ABN, First Publish Date - 2022-07-18T12:59:51+05:30

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంకర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు.ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ పేరును బీజేపీ అధిష్ఠానవర్గం ప్రకటించడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సాధారణ ఏర్పాట్లు జరిగే వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ విధులను నిర్వర్తించేందుకు మణిపూర్ గవర్నర్ ఇలా గణేశన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 6 వతేదీన జరగనుంది.‘‘పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్‌ఖర్ చేసిన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించారు’’ అని ఆదివారం అర్థరాత్రి రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పశ్చిమబెంగాల్ గవర్నరుగా అదనపు బాధ్యతలు స్వీకరించిన గణేశన్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రం. ప్రతిపక్ష పార్టీలు తమ ఉపరాష్ట్రపతి ఎంపికగా మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ కాంగ్రెస్ నాయకురాలు మార్గరెట్ అల్వాను ఎన్నుకున్నాయి. ఆమె అభ్యర్థిత్వాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు.


Updated Date - 2022-07-18T12:59:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising